Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోహ్లీ వచ్చేశాడు.. మీకుందిరా ఇగ

India Playing 11 vs England in 2nd ODI: ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో దుమ్ము దులిపిన టీమిండియా వన్డేల్లోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపుతోంది. వరుస విజయాలతో ఆ జట్టును ఠారెత్తిస్తోంది.

అయిదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే రాలేదు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ అదే హవా కొనసాగిస్తోంది. ఇందులో 1-0 ఆధిక్యతను సాధించింది. నాగ్‌పూర్‌లో ఈ నెల 6వ తేదీన జరిగిన వన్డేలో జయకేతనం ఎగురవేసింది భారత్.

IND vs ENG 2nd ODI Virat Kohli to return against England as India s Playing 11 predictions are here

నేడు రెండో వన్డేలో తలపడబోతోంది. కటక్‌లోని బారాబతి స్టేడియం దీనికి వేదిక. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో కూడా గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలివుండగానే ఈ సిరీస్ భారత్ వశమైనట్టవుతుంది. దీనికోసం జట్టు నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒకట్రెండు మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. నేటి మ్యాచ్ ఆడబోతోన్నాడు. మోకాలి గాయం వల్ల అతను తొలి వన్డేలో ఆడని విషయం తెలిసిందే.

కోహ్లీ జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకోవచ్చు. శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎలాగూ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉండటం వల్ల అయ్యర్ తప్పుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి. తొలి వన్డేలో అతను అర్ధసెంచరీతో రాణించినప్పటికీ- కోహ్లీ కోసం త్యాగం చేయాల్సి రావొచ్చు. తొలి వన్డేలో 36 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేశాడు.

ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, కేప్టెన్ రోహిత్ శర్మ ఎప్పట్లాగే ఇన్నింగ్ ఆరంభిస్తారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.

రెండో వన్డే ఆడే తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+