టీ20లకు టీమిండియా స్టార్ దూరం?
Abhishek Sharma: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దుమ్ము దులుపుతోంది భారత్. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అన్ని రంగాల్లోనూ సత్తా చాటింది. తొలుత బౌలింగ్‌లో, ఆ తరువాత బ్యాటింగ్‌లో చెలరేగింది. 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లల్లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కేప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే 68 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడా మ్యాచ్‌లో. మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్, లోయర్ ఆర్డర్‌లో జోఫ్రా అర్చర్ మినహా మరెవరూ కనీసం పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన టార్గెట్‌ను 12.5 ఓవర్లల్లో కొట్టి అవతల పడేశారు. మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులను అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. 34 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లు, అయిదు బుల్లెట్ల వంటి ఫోర్లతో 79 పరుగులు చేశాడు.
నేడు రెండో టీ20కి సన్నాహాలు చేస్తోన్నాయి రెండు జట్లు. ఈ సాయంత్రం 7 గంటలకు చెన్నై చెపాక్ స్టేడియంలో తలపడనున్నాయి. తొలి గేమ్‌లో ప్రదర్శించిన దూకుడును కంటిన్యూ చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింి. రెండో టీ20లో అభిషేక్ శర్మ ఆడకపోవచ్చు. కాలి మడమ గాయంతో అతను బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ సమయంలో అతను గాయపడ్డాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తోన్నప్పుడు అతని కుడి పాదం మెలికపడింది. దీనితో నొప్పితో విలవిల్లాడాడు అభిషేక్.
పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు గానీ ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. గ్రౌండ్ వీడాడు. ఆ తరువాత మళ్లీ ప్రాక్టీస్ సెషన్స్‌కు అటెండ్ కాలేదు. ఫలితంగా నేటి మ్యాచ్ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం జట్టుకు ఓపెనింగ్ బ్యాకప్ లేదు. ఫలితంగా సంజు శాంసన్‌తో కలిసి ధృవ్ జురెల్ లేదా తిలక్ వర్మ ఇన్నింగ్‌ను ఆరంభించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications