Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!!

T20 World Cup India Vs England: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరింది. సూపర్ -8 లో దక్షిణాఫ్రికాతో ఓటమి తరువాత భారత్ పైన ఒత్తిడి పెరిగింది. వరుసగా జింబాబ్వే .. వెస్టిండీస్ పైన విజయం సాధించి సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇక.. ట్రోఫీ గెలుచోవాలంటే మరో రెండు మ్యాచులు తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. దీంతో.. సెమీ ఫైనల్స్ లో తల పడనున్న ఇంగ్లాండ్ బౌలింగ్.. బ్యాటర్లను సమర్ధంగా ఎదుర్కునే విధంగా టీమిండియా తుది జట్టు కూర్పు పైన కసరత్తు జరుగుతోంది. అభిషేక్ కొనసాగింపు పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో ఈ నెల 5న తల పడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ పోరే. దీంతో.. ఇంగ్లాండ్ టీం లో ఎదుర్కునే బౌలర్లు.. కట్టడి చేయాల్సిన బ్యాటర్లకు అనుగుణంగా తుది జట్టు కూర్పు చేస్తున్నారు. అయితే, ఈ టోర్నమెంట్ లో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్ అభిషేక్ శర్మ ను సెమీ ఫైనల్స్ లో కొనసాగించటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జింబాబ్వే మ్యాచ్ లోనూ అభిషేక్ తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. ఇక.. వెస్టిండీస్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఫీల్గిండ్ లో రెండు కీలక క్యాచులను మిస్ చేసాడు. దీంతో.. అభిషేక్ ను తప్పించి.. ఆ స్థానంలో రింకు సింగ్ ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా.. కోచ్, కెప్టెన్ సూర్య మాత్రం అభిషేక్ కు మద్దతు గా నిలుస్తున్నారు. అభిషేక్ ఒక్క సారి క్లిక్ అయితే, మ్యాచ్ స్వరూపమే మార్చేస్తాడని చెబుతు న్నారు. సెమీస్ లో అభిషేక్ ను తప్పించటం పైన ఇంకా టీంలో చర్చ జరుగుతోంది.

ind-vs-eng-abhishek-sharmas-poor-run-in-t20-world-cup-sparks-selection-debate-ahead-of-india-vs-e

టీం మేనేజ్మెంట్ కొత్త ఆలోచనలు.. లెక్కలు

అయితే, సూపర్ -8 లో జింబాబ్వే, వెస్టిండీస్ తో ఆడిన తుది జట్లనే ఇంగ్లాండ్ పైనా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అటు ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు పూర్తి ఫాంలో ఉన్నారు. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లోనూ రాణిస్తున్నారు. అభిషేక్ స్థానంలో రింకు సింగ్ కు అవకాశం ఇచ్చినా... వపర్ ప్లే లో ఉపయోగం ఉండదని.. ఇది సరైన ఎంపిక కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటు సంజు ఫాంలోకి రావటంతో... కుడి- ఎడమ చేతి బ్యాటర్ల ఓపెనింగ్ ఇంగ్లాండ్ బౌలర్ల ను ఎదుర్కొనేందుకు అవసరమనే వాదన ఉంది. అదే విధంగా మూడో స్థానం లో ఇషాన్ కిషన్.. నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కొనసాగితేనే తొలుత బ్యాటింగ్ సమయం లో భారీ స్కోరు సాధ్య పడుతుందనే అభిప్రాయం ఉంది. ఇక.. కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్ ఎక్కువ వికెట్లు సాధించలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్ ఎంపికలోకి రావొచ్చు అనే చర్చ ఉన్నప్పటికీ, సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అదే బౌలింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది. కాగా.. ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్ పోరు ముంబాయి వేదికగా జరగనుండటంతో.. ఇండియన్ ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. టాస్.. పిచ్ కండీషన్లకు అనుగుణంగా తుది జట్టు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+