IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!!
India Vs England t20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ చేరింది. రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తల పడనుంది. విండీస్ తో మ్యాచ్ లో హోరా హోరీ తలపడిన టీమిండియా... ఇప్పుడు సూపర్ -8 లో ఓటమి లేని ఇంగ్లాండ్ పైన పోరాటం చేయనుంది. ముంబాయి ఇందుకు వేదిక కానుంది. ఇదే సమయంలో ముంబాయి సెమీ ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే.. ఈ రెండు జట్లలో ఫైనల్ చేరేదెవరు.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చగా మారింది.
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సెమీ ఫైనల్స్ కు టీమిండియా సమాయత్తం అవుతోంది. ఈ నెల 5వ తేదీన ముంబాయి లో ఇంగ్లాండ్ తో టీమిండియా రెండో సెమీ ఫైనల్ ఆడనుంది. 4న కోల్ కతా లో దక్షిణాఫ్రికా - న్యూజీలాండ్ మధ్య జరిగే తొలి సెమీఫైనలో గెలిచిన వారితో .. భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో గెలిచిన జట్టు 8న అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడనుంది. అయితే, సెమీస్ కు చేరిన టీమిండియా పైన అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో సెమీ ఫైనల్స్ కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కావడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఐసీసీ ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్ డేలో వర్షం కారణంగా పూర్తి కాలేకపోతే, రిజర్వ్ డేలో మిగిలిన ఆటను పూర్తి చేస్తారు. దీంతో.. రెండో రోజు ఫలితం రాకపోతే ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది.

రిజర్వే డే నాడూ మ్యాచ్ జరగకుంటే.. ఇంగ్లాండ్ కే ఛాన్స్
ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం తేల్చే విధానం పైన ఐసీసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో (సెమీఫైనల్ లేదా ఫైనల్) మ్యాచ్ ఫలితం రాకపోతే, సూపర్-8 దశలో అన్ని మ్యాచులు పూర్తయిన తరువాత సెమీస్ లో పోటీ పడిన రెండు జట్లలో మెరుగైన పొజీషన్ లో ఉన్న జట్టే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. సూపర్-8లో గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1 నుంచి భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్‌కు చేరింది. దీంతో, వర్షం కారణంగా రిజర్వ్ డే సైతం మ్యాచ్ జరిగే అవకాశం లేక.. భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే, ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో, వర్షం పడకూడదని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications