IND vs NZ: ప్రపంచ కప్ ఛాంపియన్ ఎవరో తేల్చేసిన AI ప్లాట్ ఫామ్స్, ఒకటే మాట..!!
T20 World cup Final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు. ఇప్పుడు ఇదే అంశం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ లో కొనసాగుతున్న చర్చ. వరుసగా రెండో సారి భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచి కొత్త రికార్డు నెలకొల్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, అటు బలమైన కివీస్ జట్టు ప్రత్యర్థి కావటంతో.. మ్యాచ్ ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. కివీస్ లో బ్యాటర్లు భయంకరమైన ఫాంలో ఉన్నారు. ఇటు భారత బౌలర్లలో బూమ్రా మినహా మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించటం లేదు. కాగా.. ఏఐ ప్లాట్ ఫామ్స్ ప్రపంచ కప్ విజేత ఎవరో తేల్చి చెప్పాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ ఒకే జట్టు పేరు చెబుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు గా బరిలోకి దిగుతున్నాయి. తుది ఫలితం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. అహ్మదాబాద్ లో గతంలో వచ్చిన ఫలితాలకు భిన్నంగా గెలుపు సాధించి కొత్త రికార్డు నెలకొల్పేందుకు సూర్య సేన బరిలోకి దిగుతోంది. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. టాస్ ఇక్కడ కీలకంగా మారనుంది. అభిషేక్ స్థానం తో పాటుగా వరుణ్ స్థానంలో కుల్దీప్ రావటం పైనా చర్చలు సాగుతున్నాయి. అటు కివీస్ లో తొలి నాలుగు స్థానాల్లో బ్యాటర్లు భీకర ఫాంలో ఉన్నారు. దీంతో.. బూమ్రా వైపు అందరి చూపు నెలకొంది. పవర్ ప్లే లో కివీస్ బ్యాటర్లను కట్టడి చేస్తే.. ఆ తరువాత మ్యాచ్ పైన పట్టు బిగించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటు.. భారత్ సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కేది. ఈ సమయంలో ఏఐ ప్లాట్ ఫామ్స్ ఛాంపియన్ ఎవరో తేల్చేసాయి.

ఏఐ ప్లాట్ ఫామ్స్ అన్నింటా ఒకటే మాట
భారత్ - కివీస్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఛాంపియన్ గా టీం ఇండియా నిలుస్తుందని మెజార్టీ ఏఐ ప్లాట్ ఫామ్స్ తేల్చి చెప్పాయి. గూగుల్ జెమినీ, ఛాట్ జీపీటీ, మరికొన్ని కూడా ఇదే అంచనా వెల్లడించాయి. గుగూల్ జెమిని భారత్ గెలిచేందుకు 60 శాతం అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. బ్లాక్ క్యాప్స్ గా చెప్పుకునే కివీస్ మంచి ఫాంలో ఉన్నప్పటికీ.. స్థానిక పరిస్థితులు భారత్ కే అనుకూలంగా ఉన్నాయని విశ్లేషించింది. ఫిన్ అలెన్ ను నియంత్రిస్తే అక్కడే భారత్ సగం గెలిచినట్లుగా పేర్కొంది. అదే విధంగా ChatGPT సైతం భారత్ ఛాంపియన్ గా నిలుస్తుందని అంచనా వేసింది. బౌలింగ్ విభాగంలో పొరపాట్లు చేయకపోతే.. బలమైన బ్యాటింగ్ లైనప్ తో ఉన్న టీమిండియా ఫైనల్స్ లో కివీస్ ను ఓడించటం కష్టం కాదని విశ్లేషణ చేసింది. దీంతో పాటుగా కోట్లాది మంది ఫ్యాన్స్ టీమిండియా గెలుపు కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అహ్మదాబాద్ బ్లూ సిటీగా మారిపోయింది.












Click it and Unblock the Notifications