రోహిత్ సేన టార్గెట్ ఇదే- కొడతారా? పడతారా?

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది. మ్యాచ్‌పై పట్టు బిగించినట్టేననిపిస్తోంది. బౌలింగ్‌లో చెలరేగింది. మూడో రోజు రెండో ఇన్నింగ్‌లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. భారీ స్కోర్ సాధించనివ్వకుండా మూకుతాడు వేసింది.

మూడో రోజు తొలి సెషన్‌లోనే చేతులెత్తేసింది న్యూజిలాండ్. 255 పరుగులకు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. మొత్తంగా భారత్ ముందు పోరాడదగ్గ స్కోర్‌ను ఉంచింది. 359 పరుగులను నిర్దేశించింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలంటే భారత్‌కు 359 పరుగులు అవసరం. ప్రస్తుతం క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉన్నారు. పరుగుల వేటలో పడ్డారు.

IND vs NZ India need 359 to beat New Zealand in 2nd test match in Pune

198 పరుగులకు అయిదు వికెట్ల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆరంభమైన న్యూజిలాండ్ ఇన్నింగ్ కుప్పకూలడానికి ఎంతో సమయం పట్టలేదు. గంటలోపే ఇన్నింగ్ ముగిసిపోయింది. 24 పరుగుల తేడాతో చివరి అయిదు వికెట్లను కోల్పోయింది. ఒకదశలో అయిదు వికెట్లకు 235 పరుగుల వద్ద కనిపించిన బ్లాక్ క్యాప్స్ స్కోర్ కార్డ్ 255 పరుగులకే ముగిసిందంటే టీమిండియా బౌలర్ల వాడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

231 పరుగుల వద్ద టామ్ బ్లండెల్ వికెట్ పడిన తరువాత వెంటవెంటనే పెవిలియన్ దారి పట్టారు ఆ తరువాతి బ్యాటర్లు. మిఛెల్ శాంట్నర్- 4, టిమ్ సౌథీ- 0, ఎజాజ్ పటేల్- 1, విలియమ్ ఒ రోర్క్- డకౌట్ అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి సహకారం అందించే వాళ్లే లేకపోయారు.

ఈ చివరి అయిదు వికెట్లను రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టారు. జడేజా- 3, అశ్విన్- 2 వికెట్లు తీసుకున్నారు. జడేజా బౌలింగ్‌లో టామ్ బ్లండెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శాంట్నర్‌, ఎజాజ్ పటేల్ వికెట్లు కూడా అతని ఖాతాలోనే పడ్డాయి. టిమ్ సౌథీని అశ్విన్ పెవిలియన్ దారి పట్టించగా.. రోర్క్ రనౌట్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్‌లో కూడా వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అతను పడగొట్టిన మొత్తం వికెట్ల సంఖ్య.. 11. దీనితో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టిన టీమిండియా బౌలర్ల జాబితాలో చేరాడు సుందర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+