బౌలర్ల దెబ్బకు అల్లాడిపోయిన బ్యాటర్లు

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. బౌలింగ్‌లో విజృంభించింది. సత్తా చాటింది. బౌలింగ్ రుచి ఎలా ఉంటుందో న్యూజిలాండ్‌ బ్యాటర్లకు తెలిసేలా చేసింది. తొలి రోజే బ్లాక్ క్యాప్స్‌ను కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్‌లో 235 పరుగులకు కుప్పకూల్చింది టీమిండియా.

బెంగళూరు, పుణేల్లో జరిగిన రెండు టెస్టుల్లో విజయఢంకా మోగించి, ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది న్యూజిలాండ్. ఇక మూడో టెస్ట్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ- టీమిండియా బౌలర్ల ప్రతాపానికి తలవంచక తప్పలేదు.

IND vs NZ New Zealand bowled out at 235 against India in 3rd test at Wankhede

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి రోజు మధ్యాహ్నం మూడో సెషన్‌కు కుప్పకూలింది. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి 185 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనానికి బ్రేకులు పడలేదు. మూడో సెషన్ నాటికి ఆలౌట్ అయింది.

తొలుత ఓపెనర్ డెవాన్ కాన్వే వికెట్‌ పడింది. 4 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు కాన్వే. అతని తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విల్ యంగ్.. మరో ఓపెనర్ టామ్ లాథమ్‌తో కలిసి చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 28 పరుగులకు లాథమ్ అవుట్ అయ్యాడు.

ఆ తరువాత వికెట్లు వరుసగా పడ్డాయి. రచిన్ రవీంద్ర- 5, టామ్ బ్లండెల్- 0, గ్లెన్ ఫిలిప్స్- 17, ఈష్ సోధి- 7, మ్యాట్ హెన్రీ- 0, ఎజాజ్ పటేల్- 7, విలియమ్ ఒ రోర్క్- 1 పరుగు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ విల్ యంగ్, మిడిలార్డర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన డారిల్ మిఛెల్ మాత్రమే భారత బౌలర్ల పని పట్టారు. విల్ యంగ్- 71, మిఛెల్- 82 పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లల్లో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయారు. ఇద్దరూ కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టారు. ఇందులో రవీంద్ర జడేజ- 5, వాషింగ్టన్ సుందర్- 4 వికెట్లు నేలకూల్చారు. ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. రెండో టెస్ట్‌లోనూ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసుకున్నాడీ చెన్నయిన్ ఆల్‌రౌండర్.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. క్లీన్ స్వీప్‌ను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా గెలవడమో లేక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమో జరిగి తీరాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పైగా కేప్టెన్ రోహిత్ శర్మ బాగా అచ్చొచ్చిన హోమ్ పిచ్‌పై మూడో టెస్ట్‌ను ఆడుతోంది.

తొలి ఇన్నింగ్‌లో బౌలర్లు సఫలం అయ్యారు. ఇక బ్యాటర్లు ఎంత వరకు సక్సెస్ అవుతారనే విషయం మీద గెలుపోటములు డిపెండ్ అయి ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్య, యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నారు. వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేశారు. రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+