Ind Vs NZ: ఫైనల్ ప్రారంభం వేళ టీమిండియాకు కొత్త టెన్షన్, లాస్ట్ మినిట్ లో..!!
T20 World cup final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరు హోరా హోరీగా సాగనుంది. కివీస్ తో ఆడే టీం ఇండియా తుది జట్టు ఖరారైంది. వాతావరణం అనుకూలంగానే ఉంది. టాస్ కీలకంగా మారుతోంది. ఫైనల్ ప్రారంభం వేళ టీం ఇండియాలో కొత్త టెన్షన్ మొదలైంది. సెంటిమెంట్ రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఈ చివరి నిమిషంలో మొదలైన ఆందోళన మ్యాచులో ఎలాంటి ఫలితం ఇస్తుందనే ఉత్కంఠ పెరిగిపోతోంది.
అహ్మదాబాద్ లో టీం ఇండియాకు చేదు జ్జాపకాలు ఉన్నాయి. దీంతో.. అహ్మదాబాద్ లో అడుగు పెట్టిన సమయంలోనే హోటల్ మార్చేసారు. నరేంద్ర మోదీ స్టేడియంలో డ్రెసింగ్స్ రూమ్ ను గతం లో వినియోగించింది కాకుండా.. మరొకటి ఎంపిక చేసుకున్నారు. ప్రాక్టీసు సెషన్ లోనూ ముహూర్తాలు పాటించారు. ఇక..అహ్మదాబాద్ లో గత చేదు జ్జాపకాలను తమ ఆట తీరుతోనే చెరిపివేయాలని టీం ఇండియా భావిస్తోంది. ఇందు కోసం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. ఇదే గ్రౌండ్ లో సూపర్ -8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. కాగా.. ఈ ఫైనల్ వేళ ఈ గ్రౌండ్ లోని పిచ్ మరోసారి టెన్షన్ కు కారణంగా మారుతోంది.

భారత్ ను వెంటాడుతున్న పిచ్ సెంటిమెంట్.. తుది జట్టులో మార్పులు
పిచ్ ఇప్పటికీ కవర్ల కిందే ఉంది. కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందని సమాచారం. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. పిచ్ పైన గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారు. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఇరు జట్ల కెప్టెన్లు అంచనా వేస్తున్నారు. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా మారనుంది. దీంతో.. రెండు జట్లకు పవర్ ప్లే కీలకంగా నిలవనుంది. రెండు జట్ల లో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో.. వారి ఆటే ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేయనుంది. అదే సమయంలో పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. స్పిన్నర్లకు సహాయం లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి, మరో పేసర్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచనగా ఉంది. అక్షర్ పటేల్ రూపంలో మరో స్పిన్నర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి, వరుణ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. లాస్ట్ మినిట్ లో వస్తున్న మార్పులు.. నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనున్నాయి.












Click it and Unblock the Notifications