రోహిత్ శర్మ అవుట్? : పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు అనూహ్య పరిణామం

Rohit Sharma: క్రికెట్ ప్రేమికులందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడబోతోంది భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని క్యాంటియాగ్ పార్క్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది.

గ్రూప్ ఏలో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో రెండోస్థానంలో నిలిచింది టీమిండియా. ఈ నెల 5వ తేదీన జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో బోణీ కొట్టింది. బౌలర్లు విజృంభించిన మ్యాచ్ అది. ఐర్లాండ్‌ను 96 పరుగులకే కట్టడి చేశారు.

IND vs PAK T20 World Cup 2024 Rohit Sharma injury and Virat Kohli face trouble in nets

ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్ పరిస్థితి దీనికి భిన్నం. తన తొలి గేమ్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పసికూన యూఎస్ఏ చేతిలో మట్టికరిచింది. సూపర్ ఓవర్‌లో తీవ్ర ఒత్తిడికి గురైంది. చేజేతులా మ్యాచ్‌ను యూఎస్‌ఏకు ధారపోసింది. ఇక- తన రెండో మ్యాచ్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్ టీమిండియాను ఎదుర్కొనబోతోంది.

పాకిస్తాన్‌ను ఎదుర్కొనడానికి భారత ప్లేయర్లు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోన్నారు. న్యూయార్క్ నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్నారు. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు షాకింగ్ న్యూస్ అందింది.

నెట్ ప్రాక్టీస్ సమయంలో కేప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అతని బొటనవేలికి గాయమైంది. నెట్ బౌలర్ సంధించిన ఓ బౌనర్స్‌ అతని వేలిని గాయపరింది. దీనితో అతను అప్పటికప్పుడు గ్రౌండ్ వీడాడు. వేలికి ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఆ సమయంలో అతని వేలిలో వాపు కనిపించింది.

అంతకుముందు ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనూ అతను గాయపడ్డాడు. రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఆ తరువాత కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొంటోన్నాడు. ఇప్పుడు తాజాగా మళ్లీ అతను గాయపడటం టీమిండియా క్యాంప్‌లో కలకలానికి దారి తీసింది. కొంత సమయం విరామం తరువాత రోహిత్ శర్మ మళ్లీ నెట్స్‌లో కనిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+