దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20: భారత్ మాజీ ప్లేయర్ డ్రీమ్ టీమ్ ఇదే
India vs South Africa 1st T20i: భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నేడు జరగబోతోంది. ఈ రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియం దీనికి వేదిక. నాలుగు టీ20 మ్యాచ్‌లతో కూడిన సిరీస్ ఇది. మిగిలిన మూడూ ఈ నెల 10, 13, 15 తేదీల్లో షెడ్యూల్ అయ్యాయి.
ఐపీఎల్ స్టార్లతో కూడిన టీ20 స్పెషలిస్ట్ టీమ్ ఇది. రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఫార్మట్‌ను తప్పుకున్న విషయం తెలిసిందే. దీనితో సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్నాడు. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లందరూ ఈ టూర్‌లో ఉంటోన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్ మ్యాచ్ తరువాత ఈ రెండు జట్లూ తలపడబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు జట్లల్లో కూడా మెరికల్లాంటి టీ20 ప్లేయర్లు ఉన్నారు. భారీ షాట్లను ఆడగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఆటగాళ్లు కనువిందు చేయనున్నారు.
తుది జట్టు రూపురేఖలు ఎలా ఉండాలనే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్, స్పోర్ట్స్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. తిలక్ వర్మ లేదా రింకూ సింగ్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. వారికి ఉన్న బ్యాటింగ్ డెప్త్..జట్టు భారీ స్కోర్ చేయడానికి సహకరిస్తుందన వ్యాఖ్యానించాడు.
అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనర్లుగా వెళ్లొచ్చని, ఆ తరువాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లేదా రింకూ సింగ్, మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడితే బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆరో నంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉంటే జట్టు భారీ స్కోర్ చేయవచ్చని సూచించాడు.
తొలి టీ20 ఆడే తుది జట్టులో- అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications