IND vs SA 2023: టీమిండియా.. ఛలో దక్షిణాఫ్రికా: నెల రోజుల క్రికెట్ జాతర..!
భారత జట్టు తీరికలేని షెడ్యూల్‌ను ఎదుర్కొంటోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023 తురువాత ఆస్ట్రేలియాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ఆడింది. ఇందులో విజయఢంకా మోగించిన భారత్.. ఇక తన నెక్స్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లింది. ఈ తెల్లవారుజామున బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డర్బన్‌కు తరలి వెళ్లింది.
సుదీర్ఘంగా సాగే సిరీస్ ఇది. 2024 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలోనే ఉంటుంది. మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది భారత జట్టుకు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్.. ఈ నెల 10వ తేదీన ఆరంభమౌతుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియం దీనికి వేదిక.

భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 12, 14 తేదీల్లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ముగుస్తుంది. 17, 19, 21 తేదీల్లో వన్డేలు షెడ్యూల్ అయ్యాయి. ఆ తరువాత టెస్ట్ సిరీస్ షురూ అవుతుంది. 26వ తేదీన తొలి టెస్ట్ జరుగుతుంది. జనవరి 3వ తేదీన రెండో టెస్ట్ ఉంటుంది.
ఈ సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకేే ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం అయ్యారు. వారిద్దరూ ఇందులో ఆడట్లేదు. టెస్ట్ సిరీస్ ప్రారంభం అయ్యే సమయానికి వారు జట్టుకు అందుబాటులోకి వస్తారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ కేప్టెన్లుగా వ్యవహరిస్తారు.
భారత టీ20 జట్టులో- యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కేప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications