Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టులకు షమీ, వన్డేలకు చాహర్, ద్రవిడ్ దూరం- బీసీసీఐ ప్రకటన

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఆడే టెస్టులు, వన్డేలకు ఇద్దరు కీలక బౌలర్లు దూరమయ్యారు. ఫామ్ లో ఉన్న మొహమ్మద్ షమీ గాయం కారణంగా దూరం కాగా.. దీపక్ చాహర్ వ్యక్తిగత కారణాలతో కీలకమైన టెస్టు, వన్డే సిరీస్ ల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో షమీకి టెస్టుల్లో చోటు కల్పించలేదని, వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ కు చాహర్ కు అవకాశం కల్పించడం లేదని తెలిపింది.

ఈసారి దక్షిణాఫ్రికాలో ఎట్టి పరిస్దితుల్లోనూ టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియాకు ఫామ్ లో ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ గాయం రూపంలో షాక్ తగిలింది. తాజాగా వన్డే వరల్డ్ కప్ లో అద్భుత బౌలింగ్ తో టీమ్ ను ఫైనల్ కు చేర్చిన షమీ గాయం కారణంగా ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు. దీంతో టెస్టు సిరీస్ కల్లా షమీ కోలుకుంటాడని అంతా ఆశించారు. కానీ షమీ కాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ మేరకు మెడికల్ టీమ్ షమీకి క్లియరెన్స్ ఇవ్వలేదని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.

IND vs SA: mohammed shami out of tests and deepak chahar from odi series, bcci announced

ఈ నెల 26న సెంచురియన్ లో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు మొహమ్మద్ షమీని బీసీసీఐ ముందు ఎంపిక చేసింది. అప్పట్లో మెడికల్ టీమ్ కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో బీసీసీఐ అతన్ని ఎంపిక చేసింది. కానీ తాజాగా షమీ గాయాన్ని పరీక్షించిన మెడికల్ టీమ్ ఫైనల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో టెస్టులకు షమీని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో భారత్ లో జనవరిలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కు షమీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో టెస్టులకు షమీ స్ధానంలోకి జట్టులోకి వచ్చే ప్రత్యామ్నాయ బౌలర్ ఎవరన్న దానిపైనా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన యువ బౌలర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వన్డేలకు తాను అందబాటులో ఉండటం లేదని చాహర్ చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో చాహర్ స్ధానంలో మరో యువ బౌలర్ ఆకాష్ దీప్ ను ఎంపిక చేశారు. మరోవైపు జోహాన్నెస్ బర్గ్ లో రేపు తొలి వన్డే ఆడిన తర్వాత స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయర్ అయ్యర్ రెండు, మూడు వన్డేలకు దూరం కానున్నాడు. తిరిగి సెంచురియన్ లో తొలి టెస్టుకు అయ్యర్ జట్టులోకి రానున్నాడు.

అటు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బృందం కూడా దూరం కాబోతోంది. హెడ్ కోచ్ ద్రవిడ్ తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే కూడా దూరమవుతారు. వీరంతా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ పై దృష్టిపెట్టేందుకు వీలుగా వీరికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. వీరి గైర్హాజరీలో వన్డే సిరీస్ లో టీమ్ మేనేజ్ మెంట్ బాధ్యతల్ని ఇండియా ఏ టీమ్ వ్యవహారాలు చూస్తున్న బ్యాటింగ్ కోచ్ శీతాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ రజిబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ రాత్రా చూస్తారని బీసీసీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+