తీరని విండీస్ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఐదో టీ20 మ్యాచ్ రద్దు!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో, నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. గ్రౌండ్ సిబ్బంది ఎంతగానో శ్రమించి వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ ను చెరో 9 ఓవర్లకు కుదించిన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన సమయంలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది. స్టేడియంలో ఆట నిర్వహణ అసాధ్యంగా మారడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!
IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!

ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత గడ్డపై సిరీస్ గెలవాలనే వెస్టిండీస్ సుదీర్ఘ నిరీక్షణ మరోసారి అసంపూర్తిగానే మిగిలిపోయింది. వెస్టిండీస్ జట్టు చివరిసారిగా 2002లో భారత్‌లో ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-3 తేడాతో గెలుచుకుంది. సుదీర్ఘమైన 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇండియాలో ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకునే సువర్ణావకాశం వెస్టిండీస్ జట్టుకు లభించినప్పటికీ.. వర్షం రూపంలో వచ్చిన అంతరాయం వారి ఆశలపై నీళ్లు చల్లింది.

IND vs WI 5th T20I Abandoned Series Tied 2-2 West Indies 24-Year Wait Continues Ishan and Naman Shined

ఈ చిన్నపోరులోనూ భారత బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్ నమోదు చేస్తూ 30 పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు పిండుకుని ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడో.. అతడి ధాటికి భయపడిన విండీస్ కెప్టెన్.. ఆ తర్వాత షెపర్డ్ కు మళ్లీ బౌలింగ్ ఇచ్చే సాహసం చేయలేదు.

వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!
వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!

అలాగే గత మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన యువ బ్యాటర్ నమన్ ధీర్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. కేవలం 6 బంతుల్లోనే ఒక ఫోర్, 3 సిక్సర్లతో 400 అత్యధిక స్ట్రైక్ రేట్ తో అజేయంగా 24 పరుగులు సాధించాడు. వర్షం మళ్లీ అంతరాయం కలిగించకపోయి ఉంటే నమన్ ధీర్ చిన్నస్వామి స్టేడియంలో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉండేది. చివరికి మ్యాచ్ ఫలితం తేలనప్పటికీ.. భారత యువ బ్యాటర్ల విధ్వంసం అభిమానులను ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+