వెస్టిండీస్ పై భారత్ గెలిస్తే సెమీస్ లో ఆ జట్టుతోనే అమీ తుమీ..!!
T20 World Cup Ind Vs WI: టీమిండియా సెమీస్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పుడు ఆ అడుగే ఉత్కంఠ పెంచుతోంది. భీకర ఫాంలో ఉన్న వెస్టిండీస్ పైన విజయం సాధించాలంటే టీమిండియా అన్ని రంగాల్లోనూ రాణించాలి. జింబాబ్వే పైన బౌలింగ్ విమర్శలకు కారణమైంది. వెస్టిండీస్ లో ఓపెనింగ్ జోడి నుంచి చివరి వరకు మంచి హిట్టర్లు ఉన్నారు. దీంతో.. సొంత గడ్డ పైన సెమీస్ కు చేరటం పై టీమిండియా పైన ఒత్తిడి పెరుగుతోంది. సెమీస్ చేరితో.. అక్కడ అసలు సిసలైన సమరానికి ప్రత్యర్ధి జట్లు ఖరారయ్యాయి.
మార్చి 1న వెస్టిండీస్ - భారత్ మ్యాచ్ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. స్వదేశీ గడ్డ పైన జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా పైన అంచనాలు పెరుగుతున్నాయి. వెస్టిండీస్ పైన గెలిస్తేనే సెమీస్ కు చేరుకుంటుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో.. ఈ మ్యాచ్ సూర్య సేనకు చావో రేవో అన్నట్లుగా మారుతోంది. జింబాబ్వే పైన జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు సత్త ప్రదర్శించ లేకపోయారు. అర్షదీప్ మినహా మిగిలిన వారు బౌలింగ్ లైన్ తప్పింది. భారీ బౌండరీలు ఇచ్చారు. ఇదే పరిస్థితి వెస్టిండీస్ మ్యాచ్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ పెంచుతోంది. బ్యాటింగ్ లో వెస్టిండీస్ టీంలో అందరూ పూర్తి ఫాంలో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఈ టోర్నీలో రాణించకపోవటం టీంకు మైనస్ గా మారుతోంది.

వెస్టిండీస్ పై గెలిస్తేనే సెమీస్ ఛాన్స్
ఇక, వెస్టిండీస్ తో గెలిస్తే.. భారత్ సెమీస్ ప్రత్యర్ధి సిద్దం అయ్యాడు. ప్రత్యర్ధి గ్రూపు లో తొలి స్థానంలో ఉన్న టీంతో భారత్ ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్ పైన టీమిండియా గెలిచినా గ్రూపు లో రెండో స్థానమే. దీంతో.. సెమీస్ లో ప్రత్యర్ది గ్రూపు లో టాప్ స్థానంలో ఉన్న టీంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూపు-2 లో ఇంగ్లాండ్ తొలి స్థానంలో, న్యూజీలాండ్ రెండో స్థానం లో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నారు. ఈ రోజు మ్యాచ్ తరువాత ఇంగ్లాండ్ గెలిస్తే తన స్థానం సుస్థిరం చేసుకుంటుంది. అదే న్యూజీలాండ్ గెలిస్తే టాప్ కు చేరుతుంది. న్యూజీలాండ్ గెలిస్తే ఇక పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. దీంతో.. భారత్ మార్చి1న వెస్టిండీస్ తో గెలిస్తే తొలి సెమీస్ లో ఇంగ్లాండ్ లేదా న్యూజీలాండ్ తో తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ రద్దయి చరో పాయింట్ ఇస్తే రెండో స్థానం కోసం పాక్ పోటీలో ఉంటుంది. అయితే, భారత్ తల పడాల్సింది తొలి స్థానంలో ఉన్న టీం కావటంతో.. ఇంగ్లాండ్ లేదా న్యూజీలాండ్ తోనే సెమీస్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, ముందుగా వెస్టిండీస్ పైన విజయం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications