IND Vs WI: ఈడెన్ లో సెంటిమెంట్ రిపీట్ అయితే, వార్ ఒన్ సైడే..!!
T20 World cup Ind Vs WI: టీ20 ప్రపంచ కప్ లో కీలక సమరానికి టీమిండియా సన్నద్ధం అవుతోంది. ప్రపంచ కప్ సెమీస్ లో చేరాలంటే క్వార్టర్ ఫైనల్ తరహా మ్యాచ్ లో భీకర ఫాంలో ఉన్న విండీస్ తో తల పడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ ఆడేందుకు ముంబాయికి.. ఓడితే ఇంటికి అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే, అన్ని రంగాల్లోనూ విండీస్ పోటీ లేదన్నట్లుగా కనిపిస్తోంది. టీమిండియా సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యం. అయితే, ఇక్కడ పిచ్ కండీషన్లు.. టాస్.. తుది జట్టు తో పాటుగా సెంటిమెంట్ సైతం ఫలితం పై ప్రభావం చూపనుంది.
వరల్డ్ కప్ సూపర్-8 ఆఖరి పోరులో ఆదివారం వెస్టిండీస్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమని స్థానిక క్యూరేటర్ సుజన్ ముఖర్జీ వెల్లడించాడు.గత నెల తొమ్మిదిన ఈడెన్‌గార్డెన్స్‌లో స్కాట్లాండ్-ఇటలీ మధ్య నిర్వహించిన మ్యాచ్ పిచ్‌పైనే భారత్-వెస్టిండీ్‌స పోరు జరగడం. ఆ పోటీలో స్కాట్లాండ్ తొలుత 200 పరుగులకుపైగా స్కోరు చేసింది. ఇక..బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వికెట్‌ను పరిశీలించి చీఫ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్‌తో కలిసి సుదీర్ఘంగా చర్చించాడు. వికెట్ ఉపరితలం బాగా పొడిగా ఉండనున్న క్రమంలో స్పిన్నర్లు కీలక భూమిక పోషించే చాన్సుంది. పిచ్‌పై బౌన్స్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటలీతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ వికెట్ నుంచి అందిన బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాంతో టీమిండియా పేస్ దళపతి బుమ్రా, ఎడమ చేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్, హార్దిక్ బౌన్స్‌తో లబ్ది పొందే అవకాశాలున్నాయి.

ఈడెన్ విండీస్ కు కలిసొచ్చిన స్టేడియం.. భారత్ ఇలా
మరోవైపు వెస్టిండీస్ ఇక్కడ రెండు గ్రూపు మ్యాచ్‌లు ఆడి ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. స్కాట్లాండ్, ఇటలీలతో జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లో కరీబియన్లు విజయం సాధించారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. జింబాబ్వే తో ఆడిన జట్టునే బరి లోకి దించటం ఖాయంగా కనిపిస్తోంది. టాస్ కీలకం కానుంది. ఇక్కడ విండీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. విండీస్ బ్యాటర్లను నియంత్రించ కలిగితే.. విజయం పైన భారత్ కు మరింత ఆశలు పెరుగుతాయి. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు జింబాబ్వే తో ఆడిన రీతిన ఆడగిలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయి. గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈసారి టీమిండియాకు మంచి అవకాశం దక్క నుంది. ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌ను చిత్తు చేసి, మార్చి 5న వాంఖడేలో ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications