భారత్ సెమీస్ చేరాలంటే జింబాబ్వే పై ఛేజింగ్, టార్గెట్ లెక్కలు ఫిక్స్ - కొత్త టెన్షన్...!!
Ind Vs Zim t20 World cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. సూపర్ -8 మ్యాచు ల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ ఇప్పుడు టీమిండియాలో ఆందోళన పెంచే విధంగా ఉన్నాయి. టీమిండియా సెమీస్ చేరాలంటే సూపర్ -8 లో మిగిలిన రెండు మ్యాచులు విజయం సాధించాల్సిందే. ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్క. అయితే, జింబాబ్వే పైన వెస్టిండీస్ సాధించిన భారీ విజయం తో కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. టీమిండియా గెలవటం మాత్రమే కాదు.. జింబాబ్వా ముందు ఉంచాల్సిన లక్ష్యం.. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఛేజింగ్ లెక్కలు ఫిక్స్ అయ్యాయి. ఇవి చేరుకుంటనే సెమీస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
టీమిండియా లో సెమీస్ లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీమిండియా సూపర్ -8 లో భాగంగా జింబాబ్వే... వెస్టిండీస్ తో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు గెలవటమే కాదు.. భారీ రన్ రేటు సాధిస్తేనే సెమీస్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 26న చెన్నైలో జింబాబ్వే తో టీమిండియా ఆడే మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ ప్రపంచ కప్ లీగ్ దశలో జింబాబ్వే టీం ఊహించని ఫలితాలు సాధించింది. ఇక.. వెస్టిండీస్ - జింబాబ్వే మధ్య జరిగిన సూపర్ -8 మ్యాచు లో వెస్టిండీస్ భారీ విజయం నమోద చేయటంతో టిమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. భారత్ సెమీస్ అవకాశాలను కరేబియన్ టీం వెనక్కు నెట్టేసింది. ఇప్పుడు గెలుపుతో పాటుగా నెన్ రన్ రేటు కీలకంగా మారుతోంది. ప్రస్తుతం మైనస్ లో ఉన్న టీమిండియా రన్ రేట్ ప్లస్ లోకి రావటం తో పాటుగా మిగిలిన మూడు టీంల లెక్కల కంటే మెరుగైన స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా జింబాబ్వేపై భారీ తేడాతో గెలవడం భారత్‌కు అత్యవసరం.

తొలుత బ్యాటింగ్ చేస్తే ఇలా.. ఛేజింగ్ లెక్క ఇలా
జింబాబ్వేతో జరిగే మ్యాచులో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే, ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి, లక్ష్యాన్ని చాలా వేగంగా చేధించాలి. టార్గెట్ చిన్నగా ఉంటే తక్కువ ఓవర్లలో చేధించడం సులభమవుతుంది. అయినప్పటికీ, బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడాల్సిందే. ఇందు కోసం కావాల్సిన లెక్కలు సిద్ధమయ్యాయి. తొలుత జింబాబ్వే బ్యాటింగ్ చేస్తే వారు నిర్దేశించే లక్ష్యాన్ని ఓవర్ కు 14 పరుగుల చొప్పున చేధింజి విజయం నమోదు చేసుకోవాలి. లక్ష్యం 150 పరుగులు ఉంటే, భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అదే విధంగా భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 220 నుంచి 250కి పైగా పరుగులు చేయాలి. అనంతరం ప్రత్యర్థిని 100-120 లేదా అంతకంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలి. ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తే ఓవర్లు ఆదా అవుతాయి కాబట్టి NRRకి మరింత లాభం ఉంటుంది. సౌతాఫ్రికా.. వెస్టిండీస్ భారీగా రన్ రేటుతో ఉండటంతో.. సూర్య టీం వచ్చే రెండు మ్యాచుల్లో సాదా సీదా విజయం సాధిస్తే సరిపోదు. భారీ రన్ రేటుతో గెలిస్తేనే సెమీస్ కు అవకాశం ఉంటుంది. దీంతో.. ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్ వేళ తుది జట్టు ఎంపిక.. ఆట తీరు.. ఫలితం.. రన్ రేటు పైన టీం తో పాటుగా ఫ్యాన్స్ లోనూ ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications