వన్డేల్లో ఐపీఎల్ రేంజ్ బ్యాటింగ్.. బుడ్డోడి ఊచకోత !

శ్రీలంక వేదికగా జరుగుతోన్న వన్డే ట్రై-సిరీస్‌లో భాగంగా దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో భారత్ ఏ , ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియాకు యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ కలిసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పోటీపడి మరీ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బౌండరీల వర్షం కురిపించాడు.

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి.. కువైట్ సంచలన నిర్ణయం!
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి.. కువైట్ సంచలన నిర్ణయం!

తొలి మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే ఔటయ్యి అభిమానులను నిరాశపరిచిన వైభవ్.. ఈ రెండో మ్యాచ్‌లో మాత్రం మొదటి బంతి నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన ఫామ్‌తో సరికొత్త బ్యాటింగ్ విధ్వంసాన్ని ప్రదర్శించాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. బౌండరీలతో దాడి చేస్తూ ఏకంగా 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు బాదాడు. అయితే అర్ధశతకానికి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నప్పుడు, ఇన్నింగ్స్ 8వ ఓవర్లో అబ్దుల్లా అహ్మద్‌జాయ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఒక తప్పుడు షాట్ కారణంగా హాఫ్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని వైభవ్ సూర్యవంశీ చేజార్చుకున్నాడు.

India A vs Afg A Vaibhav Suryavanshi Smashes 44 Runs in 22 Balls in One Day Tri-Series Full Details
టీమిండియా మాజీక్రికెటర్ రిటైర్మెంట్..! జగన్ ఎమోషనల్ ట్వీట్..!
టీమిండియా మాజీక్రికెటర్ రిటైర్మెంట్..! జగన్ ఎమోషనల్ ట్వీట్..!

ఐపీఎల్ 2026 సీజన్ లో చూపించిన భీకరమైన ఫామ్‌ను వైభవ్ ఈ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా ఏ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. రాబోయే రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ కనబరిచిన మెరుపు ప్రదర్శనకు గుర్తింపుగా బీసీసీఐ అతడికి భారత టీ20 జట్టులో స్థానం కల్పించింది. త్వరలో జరగబోయే అంతర్జాతీయ సిరీస్‌లలో కూడా ఈ యువ బ్యాటర్ భారీ స్కోర్లతో అలరిస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+