ముక్కోణపు వన్డే సిరీస్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత్..
శ్రీలంక వేదికగా జరిగిన మహిళల ముక్కోణపు వన్డే ట్రై సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ టీం సత్తా చాటింది. కొలంబోలోని ఆర్‌పిఎస్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. శ్రీలంకపై భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు కూడా రాణించడంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
దుమ్ములేపిన స్మృతి మంధాన..
బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు స్మృతి మందాన అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగుల అద్భుత శతకం బాదింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్ (47), హర్మన్ ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44) పరుగులతో మంచి సపోర్ట్ ఇవ్వడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. చివర్లో వచ్చిన దీప్తి శర్మ సైతం (20 నాటౌట్) గా నిలిచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. శ్రీలంక బౌలర్లలో మాల్కీ మడారా, దెవ్మి విహంగా, సుగంధిక కుమారి చెరో రెండు వికెట్లు తీశారు.

భారీ స్కోరును చేధించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్ మెన్ లను భారత బౌలర్లు సమిష్టిగా కట్టడి చేశారు. కెప్టెన్ చమారి అథపత్లు (51), నీలాక్షి డి సిల్వా (48), విష్మి (36)లు కొంత పోరాడినా.. మిగతా బ్యాటర్లు
వరుసగా పెవిలియన్ బయట పట్టడంతో ఓటమి తప్పలేదు. ఇండియన్ టీం బౌలర్లలో స్నేహ్ రానా అద్భుతంగా 4 వికెట్, అమన్ జ్యోత్ కౌర్ 3 వికెట్లు, శ్రీచరణి ఒక వికెట్ తీశారు. ఈ విజయంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన స్మృతి మంధాన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలుచుకోగా, బౌలింగ్‌లో విశేషంగా రాణించిన స్నేహ్ రానా 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' గా ఎంపికైంది.
రికార్డులు..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన స్మృతి మంధాన, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా కొత్త రికార్డును సృష్టించింది. దీంతో మహిళల టీంని తెగ పొగిడేస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
𝙒𝙞𝙣𝙣𝙚𝙧𝙨 𝙖𝙧𝙚 𝙜𝙧𝙞𝙣𝙣𝙚𝙧𝙨 😁#TeamIndia, the winners of #WomensTriNationSeries2025 🏆
— BCCI Women (@BCCIWomen) May 11, 2025
Scorecard ▶️ https://t.co/rVyie6SUw9#INDvSL pic.twitter.com/Ti3rNQopUd












Click it and Unblock the Notifications