మెల్ బోర్న్ లో చిత్తుగా ఓడిన భారత్- అనూహ్యంగా చేతులెత్తేసిన బ్యాటర్లు-యశస్వి పోరాటం వృథా..!
మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా అనూహ్యంగా చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా విసిరిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో మెల్ బోర్న్ టెస్టులో భారీ ఓటమి తప్పలేదు.
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీతో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి కూడా విఫలమైన వేళ చేతులారా నాలుగో టెస్టు ఆస్టేలియాకు అప్పగించింది.

మెల్ బోర్డ్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 140 పరుగుల సాయంతో 474 రన్స్ చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ శుభారంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్ సద్వినియోగం చేసుకోకపోవడంతో కుప్పకూలింది. అయితే చివర్లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఫాలో ఆన్ గండం దాటించాడు. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచరీ చేయగా.. సుందర్ 50 పరుగులు చేసాడు. దీంతో భారత్ 369 పరుగులు చేసింది.
105 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా అనూహ్యంగా కుప్పకూలింది. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ కంగారూల్ని కుదురుకోనివ్వలేదు. అయితే టాప్ ఆర్డర్ పెవిలియన్ బాట పట్టినా లబుషేన్ టెయిలెండర్లతో కలిసి విలువైన 70 పరుగులు జోడించాడు. బౌలర్లు కమిన్స్, లయాన్ తలో 41 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 339 పరుగుల లీడ్ సాధించిన కంగారూలు భారత్ ముందు 340 పరుగుల టార్గెట్ పెట్టారు.
దీంతో ఐదో రోజు ఆటలో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మళ్లీ యశస్వి శుభారంభం ఇచ్చినా మిగతా టాప్ ఆర్డర్ నుంచి సహకారం లభించలేదు. రోహిత్ 9, కేఎల్ రాహుల్ 0, విరాట్ కొహ్లీ 5 పరుగులు చేసి వెనుదిరిగారు. ఈ దశలో పంత్ 30 పరుగులు చేసి ఆదుకున్నా.. ఆ తర్వాత మళ్లీ వికెట్ల పతనం కొనసాగింది. చివరికి యశస్వీ కూడా అవుట్ కావడంతో భారత్ ఆశలు అడుగంటాయి.
యశస్వి 84, పంత్ 30 మినహా మిగతా బ్యాటర్లు కనీసం రెండకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో భారత్ 155 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 184 పరుగులతో ఓటమి పాలైంది. ఐదు టెస్టుల సిరీస్ లో నాలుగో టెస్టు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తొలి టెస్టు గెలవగా..ఆస్టేలియా, రెండు, నాలుగు టెస్టులు గెలిచింది. మధ్యలో మూడో టెస్టు డ్రా అయింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications