Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బౌలింగ్ తో బేజార్- ఆ ఇద్దరి ఫ్లాప్ షో

టీమిండియా మరో చారిత్రక ఘట్టానికి తెర తీయబోతోంది. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచివుంది. ఆదివారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌ను ఎప్పుడూ ఓడించలేదు భారత్. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ కివీస్ దే పైచేయి. ఓవరాల్‌గా 30 టీ20 మ్యాచ్‌లలో భారత్ 16 విజయాలతో ఆధిక్యంలో ఉంది. రెండు సూపర్ ఓవర్లలో భారత్ గెలిచింది. ఒకటి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ముగిసింది.

సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. భారత్ 253/7 భారీ స్కోరు చేయగా, సంజు శాంసన్ 42 బంతుల్లో 89 రన్స్‌తో రాణించాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు నిరాశపరిచారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 51/1, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64/1తో ఆందోళన కలిగించారు. దీంతో ఫైనల్‌కు తుది జట్టులో మార్పులుంటాయా, కుల్ దీప్ యాదవ్‌కు అవకాశం లభిస్తుందా, అభిషేక్ శర్మ ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

India Playing 11 vs New Zealand in T20 WC Final Dilemma over Kuldeep Yadav or Varun Chakaravarthy

వరుణ్ నిరుత్సాహపరిచినప్పటికీ.. ఈ టోర్నమెంట్ లో అతను భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 8 మ్యాచ్‌లలో అతని బౌలింగ్ సగటు 19.07, ఎకానమీ రేటు 8.85తో 13 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై వరుణ్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. నాలుగు టీ20లలో నాలుగే వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ 32.75, ఎకానమీ 8.18. నరేంద్ర మోదీ స్టేడియంలో అతని రికార్డు మెరుగ్గా ఉంది. మూడు మ్యాచ్‌లలో 8 వికెట్లు, సగటు 14.25, ఎకానమీ 8.25ని రికార్డు చేశాడు. ఫైనల్ కావడం తో ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తిని ఈ సారి బెంచ్ కు పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదు.

ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 9 పరుగులకే అవుట్ కావడం ట్రోల్స్ కు దారి తీసింది. ఈ టోర్నీ ఏడు ఇన్నింగ్స్‌లలో 12.71 సగటుతో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అతనికి మరో అవకాశం ఇవ్వొచ్చు. ఫైనల్‌లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడటం అభిషేక్‌కు కీలకం. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. రింకూ సింగ్‌ను మిడిల్ ఆర్డర్‌కు, సంజు శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలని మాజీ క్రికెటర్లు సూచిస్తోన్నారు.

అహ్మదాబాద్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్‌లో ఆడిన అదే తుది జట్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అహ్మదాబాద్ పిచ్‌పై కుల్ దీప్ యాదవ్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మొత్తం 54 టీ20లలో 95 వికెట్లు తీశాడు గానీ న్యూజిలాండ్ పై బ్యాడ్ రికార్డ్ ఉంది. ఇదే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్ వేసి 12 పరుగులు ఇచ్చాడు.

ఫైనల్స్ ఆడే భారత తుది జట్టులో- అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+