మణికట్టు మాంత్రికుడికి పిలుపు?
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన సూపర్ 8 పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు డూ ఆర్ డైగా సమరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. జింబాబ్వేపై భారీ విజయంతో సెమీఫైనల్ ఆశలు మొలకెత్తాయి. ఇప్పుడు సెమీఫైనల్ ఎంట్రీ పాస్ కోసం వెస్టిండీస్ తో తలపడాల్సి ఉంది. భారత్, వెస్టిండీస్ రెండూ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన జట్లే.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత..
ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ సెమీఫైనల్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఈ అవకాశం ఇంకా భారత్ కు దక్కట్లేదు. సూపర్ 8 దశకు అజేయంగా దూసుకెళ్లినప్పటికీ.. ఇక్కడ ఆ జట్టు ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్, ప్లేయింగ్ 11 లో మార్పులు అనివార్యం అయ్యాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వ్యూహాన్ని మార్చింది భారత్.

బ్యాటింగ్ ఆర్డర్..
అభిషేక్ శర్మకు ఓపెనింగ్ భాగస్వామిగా సంజు శాంసన్ దిగాడు. ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మార్పు ఫలించింది. సంజు మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. అభిషేక్ శర్మ సంయమనంతో ఆడాడు. అర్ధ సెంచరీతో ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు. సాధారణంగా మూడో స్థానంలో ఆడే తిలక్ వర్మ, ఆరో స్థానంలో వచ్చి ఫినిషర్ పాత్రను అద్భుతంగా పోషించాడు. 16 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేశాడు.
బౌలింగ్ ఆందోళనకరంగా..
బ్యాటింగ్ బాగున్నా, బౌలింగ్ ఆందోళనకరంగా పరిణమించింది. బౌలర్లు విఫలం కావడం వల్ల జింబాబ్వే కూడా భారత్ పై 180కి పైగా పరుగులు సాధించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే మీడియం పేస్‌ను ప్రత్యర్థులు స్వేచ్ఛగా ఎదుర్కొన్నారు. అతని బౌలింగ్ లోనే భారీగా పరుగులు పిండుకున్నారు. వెస్టిండీస్ బ్యాటర్ల దూకుడు దృష్ట్యా కోల్‌కతాలో అతన్ని బౌలింగ్‌కు దించే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు.
నిరాశపరిచిన బౌలర్లు..
నిలకడగా రాణించే వరుణ్ చక్రవర్తి కూడా గత రెండు మ్యాచ్‌లలో విఫలం అయ్యాడు. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జింబాబ్వేపై అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చినప్పటికీ అతను కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో బౌలింగ్ భారాన్ని జస్‌ప్రీత్ బుమ్రా తన భుజాలపై మోయాల్సి వస్తుంది. బుమ్రా ఓవర్లను జాగ్రత్తగా ఆడి, ఇతర బౌలర్లను లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టాలని ప్రయత్నించవచ్చు.
కుల్‌దీప్ యాదవ్ కు ఛాన్స్..
రిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.. స్పిన్నర్లకు అనుకూలించిన కొలంబోలో పాకిస్తాన్‌తో. అక్షర్ స్థానంలో కుల్‌దీప్‌ను తీసుకువస్తారా? లేదా దూబేను బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది వేచి చూడాలి. ఈ రెండూ బ్యాటింగ్ ఆర్డర్ ను ప్రభావితం చేస్తాయి. దక్షిణాఫ్రికాపై ఎదురైన బ్యాటింగ్ వైఫల్యాన్ని పునరావృతం చేయకూడదనుకుంటున్న జట్టు యాజమాన్యం.. గెలిచిన కూర్పుతోనే కోల్‌కతాలో బరిలోకి దిగే అవకాశం ఉంది.
వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ లో భారత్ తుదిజట్టులో- సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా ఆడే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications