ICUలో వన్డే క్రికెట్.. టికెట్ ముక్క తెగడం లేదు.. ఏం చేయాలి..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ శుభారంభం అదిరింది. దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయం సాధించింది. టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (101*) సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ విజయం సులభంగా మారింది.

India vs Bangladesh Champions Trophy Match Played in Front of a Completely Empty Stadium

అయితే ఈ మ్యాచ్ చూసేందుకు మాత్రం అభిమానులు ఎవరూ స్టేడియానికి రాలేదు. దుబాయ్ లోని మ్యాచ్ జరిగిన స్టేడియంలో మొత్తం సీటింగ్ సామర్థ్యం 25,000 కాగా.. సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. వన్డేల్లో టీమ్ ఇండియా బరిలోకి దిగుతుందని తెలిస్తే గతంలో టికెట్టు ముక్క మిగిలేది కాదు. టికెట్ల కోసం ప్రేక్షకులు నానా తంటాలు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీ20, ఐపీఎల్ ప్రభావం వల్ల వన్డే క్రికెట్ కు ఆదరణ తగ్గిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తొలి చైర్మన్ లలిత్ మోడీ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. వన్డే క్రికెట్ ఫార్మాట్‌పై అతను ప్రశ్నలను లేవనెత్తుతూ, వన్డే క్రికెట్‌ను రద్దు చేసి మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+