సెమీస్ వేళ టీమిండియా కు డేంజర్ బెల్స్, అదే రిపీట్ అయితే ఇక..!!
T20 World Cup India Vs England Semi final: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ లో ఇంగ్లాండ్ తో తల పడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అటు అనూహ్యంగా దక్షిణాఫ్రికా పైన విజయం సాధించి న్యూజీలాండ్ ఫైనల్ కు చేరింది. ఈ రోజు గెలిచిన టీం ఫైనల్ లో కివీస్ తో తల పడనుంది. అయితే, సెమీస్ వేళ టీమిండియా బలహీనతల పై చర్చ మొదలైంది. అదే ఇంగ్లాండ్ కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. గౌతం గంభీర్ తన ప్లాన్ మార్చేసారు. కొత్త వ్యూహాలు సిద్దం చేసారు.
టీ20 ప్రపంచ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు సెమీఫైనల్స్‌లో వరుసగా మూడోసారి తలపడుతున్నాయి. 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి కప్ గెలుచుకోగా, 2024లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి కప్ గెలుచుకుంది. ఇప్పుడు 2026లో ఈ రెండు జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి. కాగా, ముంబైలో వర్షం పడే అవకాశం లేదు. వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రెండు వైపుల నుండి పరుగులు ఆశించవచ్చు. అలాగే, రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు సహాయపడుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఆ బలహీనత అధిగమిస్తేనే
కాగా.. ఈ టోర్నీలో సెమీస్ వరకు చేరిన టీమిండియాలో ఒక బలహీనత కనిపిస్తోంది. అది సెమీస్ లోనూ రిపీట్ అయితే... ఇంగ్లాండ్ కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జింబాబ్వేతో సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. వెస్టిండీస్ మ్యాచ్ లోనూ సంజూ ఇక్కడే 97 పరుగులు చేసి జట్టును సెమీస్ చేర్చాడు. ఇక, బౌలర్లు ఒత్తిడిలో కనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు లో రషీద్ ను పవర్ ప్లే లోనే దించితే అభిషేక్, ఇషాన్ ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. పవర్ ప్లే లో వరుసగా టీమిండియా ఓపెనర్లను కోల్పోతుంది.
సెమీస్ లో ఆ గండం నుంచి బయట పడితే ఫైనల్స్ కు వెళ్లటం సమస్య కాదు. అదే విధంగా ఇంగ్లాండ్ టీం సైతం ఈ సారి ఎలాగైనా టోర్నీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అటు కివీస్ ఫైనల్ కు చేరటంతో... ఈ రోజు సెమీస్ ఆడుతున్న రెండు జట్లలో ఉత్సాహం పెరిగింది. టాస్ ఇక్కడ కీలకం కానుంది. అభిషేక్ - ఇషాన్ రాణిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే. దీంతో.. టాప్ ఆర్డర్ నిలబడటం.. బౌలింగ్ లో సమిష్టి గా రాణించటం.. ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటే.. భారత్ ఫైనల్స్ చేరటం కష్టం కాదు. దీంతో.. ఫ్యాన్స్ ఉత్కంఠగా చూస్తున్న ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఎలా సక్సెస్ అవుతుందనేది చూడాలి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications