విశాఖ మ్యాచ్ కు ఇద్దరు టీమిండియా స్టార్ ప్లేయర్లు దూరం, వారికి పిలుపు..!!

India Vs New Zealand T20: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ లో టీమిండియా జోష్ మీద ఉంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లను గెలిచి సిరీస్ కైవసం చేసు కుంది. సిరీస్ లో నాలుగో మ్యాచ్ సాగర తీరం విశాఖలో జరుగుతోంది. టీమిండియా బ్యాటర్ల లైనప్ కు ఎంత భారీ స్కోరు అయినా చిన్నబోతోంది. అభిషేక్... ఇషాన్, సూర్య ఫుల్ ఫాంలో ఉన్నారు. వీరిని కట్టడి చేయటం కివీస్ బౌలర్లకు సమస్యగా మారుతోంది. ఇదే సమయంలో ఈ మ్యాచ్ కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. వారి స్థానంలో మరో ఇద్దరు ఎంట్రీ ఇస్తున్నారు.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న టీమిండియా వర్సస్ న్యూజీలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఉన్నారు. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా సిరీస్‌ను గెలుచుకున్న సూర్యసేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలిన చూస్తోంది. టీ20 ప్రపంచ కప్ కు సన్నాహకాల్లో భాగంగా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్ మెంట్ భావిస్తోంది.

IND vs New Zealand Shreyas Iyer and axar patel eyes a chance for the 4th T20 at visakhapatnam

అందులో భాగంగా ఈ మ్యాచ్ లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలర్ జస్ప్రిత్ బూమ్రా కు విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో న్యూజీలాండ్ పైన ఒత్తిడి పెరుగుతోంది. చివరి రెండు మ్యాచ్ లు అయినా గెలిచి పరువు కాపాడు కోవాలని ప్రయత్నిస్తోంది.

విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్ కు అనుకూలంగా ఉండనుంది. ఈ మైదానంలో భారీగా పరుగుల వరద ఖాయం. ఈ వేదికలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 148. అత్యధిక స్కోరు 215, అత్యల్ప స్కోరు 82గా నమోదైంది. ఈ స్టేడియంలో ఛేజింగ్ జట్టుకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. రెండవ ఇన్నింగ్స్‌లో పడే మంచు ఛేజింగ్ జట్టుకు సహాయం చేస్తుంది.

IND vs New Zealand Shreyas Iyer and axar patel eyes a chance for the 4th T20 at visakhapatnam

ఈ వేదికలో ఇప్పటివరకు మొత్తం 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 3 సార్లు ఛేజింగ్ జట్లు గెలిచాయి. దీంతో, టాస్ ఇక్కడ కీలక పాత్రను పోషిస్తుంది. అయితే... టీమిండియా బ్యాటర్లు అభిషేక్, ఇషాన్, సూర్య కుమార్ యాదవ్ బ్యాటు నుంచి బౌండరీల వరద మరోసారి ఖాయంగా కనిస్తోంది. దీంతో.. విశాఖలో క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ రోజు బౌండరీల పండుగ ఆస్వాదించటానికి ఫ్యాన్స్ సిద్దమై పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+