Viral Video: నువ్వెంత అంటే నువ్వెంత ? భారత్-పాక్ మ్యాచ్ లో కొట్టుకున్న క్రికెటర్లు..!

ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగుల టార్గెట్ ఇవ్వగా దీన్ని ఛేదించడంలో విఫలమైన పాకిస్తాన్ 106 పరుగులకే ఆలౌటైంది. దీంతో మహిళల టీ20 వరల్డ్ కప్ లో బోణీ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో పలుసార్లు ఇరుదేశాల క్రికెటర్లు సై అంటే సై అనేలా కనిపించారు. అయితే మ్యాచ్ తర్వాత కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి.

India vs Pakistan: మరో ఇండియా-పాక్ మ్యాచ్..! హ్యండ్ షేక్ పై కెప్టెన్ క్లారిటీ..!
India vs Pakistan: మరో ఇండియా-పాక్ మ్యాచ్..! హ్యండ్ షేక్ పై కెప్టెన్ క్లారిటీ..!

వీటిలో భారత్-పాక్ మహిళా క్రికెటర్లు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. నానా మాటలు అనుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ ను ఓ భారత క్రికెటర్ గొంతు పట్టుకున్నట్లు కూడా వీడియో వైరల్ (viral video) అవుతోంది. దీంతో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ స్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో ఈ వీడియోల్ని నిర్ధారించుకునేందుకు అందరూ ఫ్యాక్ట్ చెక్ చేయడం మొదలుపెట్టారు.

India vs Pakistan T20 Clash Separating Fact from Fiction Behind the Viral Video
కొహ్లీ బాటలో హార్దిక్ పాండ్యా..! టీమిండియాకు మరో షాక్..!
కొహ్లీ బాటలో హార్దిక్ పాండ్యా..! టీమిండియాకు మరో షాక్..!

ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు ఎడ్జ్ బాస్టన్ మైదానంలో అలాంటి ఘటనేదీ జరగలేదని తేలింది. కానీ ఈ ఘటన జరిగినట్లుగా కొందరు డీప్ ఫేక్ ద్వారా వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలినట్లు తేలింది. ఇది తెలియక భారత్-పాక్ అభిమానులు ఇంటర్నెట్ లో పరస్పరం రెచ్చిపోతున్నారు. దీంతో కొందరు ఫ్యాక్ట్ చెకర్లు రంగంలోకి దిగి ఇది ఫేక్ వీడియోగా నిర్ధారిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఆ లోపే ఈ వీడియో ప్రపంచాన్ని చుట్టేయడంతో అసలు క్రీడాభిమానులు తలపట్టుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+