IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ?

ఈసారి ఐపీఎల్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందే పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో ఆడిన పలువురు ఆటగాళ్లు ఈసారి వివిధ కారణాలతో తమ జట్లకు దూరమవుతున్నాయి. మిగిలిన వారు కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్ధితి. ఇదే క్రమంలో ఇవాళ ఇంగ్లండ్ (england) స్టార్ బ్యాట్స్ మెన్ ఒకరు ఐపీఎల్ జట్టుకు గుడ్ బై చెప్పేశాడు. సింపుల్ గా అయామ్ సారీ అని మెసేజ్ పెట్టి ఈ సీజన్ నుంచి ఆడకుండా తప్పుకున్నాడు.

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ బెన్ డకెట్ (ben duckett).. తాను ఐపీఎల్ 2026 నుండి వైదొలుగుతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సమాచారం ఇచ్చాడు. వేలంలో రూ.2కోట్లకు కొనుగోలు చేసిన డకెట్‌ను, కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ కు పంపాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. అయితే అతను ఇవాళ హఠాత్తుగా ఈ సీజన్ కు గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ నుండి వైదొలగాలనే అత్యంత కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. దీని గురించి చాలా ఆలోచించాను, ఇది అంత సులభమైన ఎంపిక కాదు, చిన్నప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను, ఇంగ్లీష్ క్రికెట్‌కు నా సర్వస్వం ఇవ్వాలనుకుంటున్నాను, అలా చేయడానికి, వేసవికి ముందు శారీరకంగా, మానసికంగా ఉత్తమ స్థితిలో ఉండాలని డకెట్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

I m Sorry Says England Star Before Shock IPL 2026 Withdrawal Faces Disciplinary Action

ఢిల్లీలోని ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని డకెట్ తెలిపాడు. ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఒక జట్టును నిర్మించడానికి ఎంత సమయం, ప్రణాళిక అవసరమో తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని డకెట్ చెప్పుకొచ్చాడు. తన నిర్ణయం వల్ల కలిగే ఏ ఇబ్బందికైనా చింతిస్తున్నానని వెల్లడించాడు. ఢిల్లీలోని ప్రతిఒక్కరికీ ఇది ఎంత ముఖ్యమో తనకు తెలుసు కాబట్టి, అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. అయితే ఇలా హఠాత్తుగా టోర్నీ నుంచి తప్పుకోవడం నిబంధనలకు విరుద్దం కావడంతో క్రమశిక్షణా చర్యల కింద డకెట్ పై ఐపీఎల్ అధికారులు రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+