Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్డికి పిలుపు- జడేజాకు ప్రమోషన్: అయ్యర్ కు మళ్లీ మొండిచేయి: కొత్త జట్టు అనౌన్స్ మెంట్

వెస్టిండీస్‌తో త్వరలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇది. ఇందులో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఆల్ రౌండర్ కు ప్రమోషన్ సైతం లభించింది. అలాగే- బ్యాటింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికీ బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు కొత్త జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఇది. భారత్ లో పర్యటించనుంది వెస్టిండీస్ జట్టు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ కు సంబంధించి భారత్‌కు మొదటి స్వదేశీ టెస్ట్ సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇంగ్లాండ్ లో ఆ దేశ జట్టుతో జరిగిన అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే.

India Vs West Indies Test Squad Announcemen Jadeja gets promotion

ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ గా శుభ్‌మన్ గిల్ కంటిన్యూ అయ్యాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ లభించింది. జట్టుకు కొత్త వైస్ కేప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. నిజానికి- వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. టెస్ట్ ఫార్మట్ కు వైస్ కేప్టెన్ గా నియమితుడు కావాల్సి ఉంది. ప్రస్తుతం అతను గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతన్ని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు.

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడిన చాలా మంది ప్లేయర్లకు చోటు దక్కలేదిందులో. ఫామ్ కోల్పోయిన వారిని జట్టు నుంచి తప్పించారు. ఇంగ్లాండ్ లో రాణించని కరుణ్ నాయర్ పై వేటుపడింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ జట్టులో అవకాశం దక్కించుకున్న కరుణ్.. ఆ సిరీస్ లో విఫలం అయ్యాడు. దీనంతో అతనికి నిష్క్రమణ తప్పలేదు. అతనితో పాటు ఆకాష్ దీప్ కూడా ఈ జట్టులో లేడు. గాయం కారణంగా అతన్ని పక్కన పెట్టారని భావిస్తున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా వెళ్లిన అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ జట్టులో ఎంపిక కాలేదు. రిషబ్ పంత్ గాయపడిన తర్వాత చివరి మ్యాచ్‌కు ఇంగ్లండ్‌లో జట్టుతో కలిసిన ఎన్. జగదీశన్‌ను ఈ సిరీస్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా చేర్చారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ప్రస్తుత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించలేకపోయారు.

భారత టెస్ట్ జట్టు వివరాలు: శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+