టీమిండియాలో ఏకంగా ముగ్గురు ఐపీఎల్ స్టార్స్
India vs Zimbabwe: భారత జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇంకా వెస్టిండీస్‌లోనే ఉంది టీమ్ మొత్తం. ఫైనల్స్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన బార్బడొస్ ప్రస్తుతం తుఫాన్ గుప్పిట్లో చిక్కుకుంది. ఫలితంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఆ దేశం మొత్తం కర్ఫ్యూ విధించారు. టీమిండియా కూడా అక్కడే చిక్కుకుపోయింది.
అదే సమయంలో మరో జట్టు జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లిందీ ఉదయం. సీనియర్లు ఒక్కరు కూడా లేని టీమ్ ఇది. అందరూ జూనియర్లే ఉన్నారు. ఐపీఎల్‌లో దుమ్ములేపిన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. యంగ్ క్రికెటర్లకు ఇదో మంచి అవకాశం.

కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టీ20 ఇంటర్నేషనల్స్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యంగ్ క్రికెటర్లకు ఈ సిరీస్ అద్భుతమైన అవకాశం కల్పించినట్టయింది. ఇందులో సత్తా చాటిన ప్లేయర్లకు టీమిండియా సీనియర్ల జట్టులో రోడ్ కార్పెట్ స్వాగతం లభించడం లాంఛనమే అవుతుంది.
మొత్తం అయిదు టీ20 ఇంటర్నేషనల్స్‌తో కూడిన సిరీస్ ఇది. నాలుగో మ్యాచ్ మినహా మిగిలినవన్నీ కూడా సాయంత్రం 4:30 గంటలకు ఆరంభమౌతాయి. రాజధాని హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్.. వీటికి వేదిక. తొలి మ్యాచ్ ఈ నెల 6వ తేదీన మొదలవుతుంది. 7, 10, 13, 14 తేదీల్లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. జింబాబ్వేతో తొలి రెండు టీ20ల్లో ఆడే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది.
ఇదివరకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వారిని కూడా ఇంక్లూడ్ చేసింది బీసీసీఐ. సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్ చేసింది. ఐపీఎల్ స్టార్లను జట్టులోకి తీసుకుంది.
తొలి రెండు టీ20లు ఆడే జట్టులో- శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణాలకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications