ICC WorldCup 2023: వరల్డ్ లో సెమీఫైనల్ కు వెళ్లేది వీరే-దినేష్ కార్తీక్ అంచనా ఇదే..!
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ చివరికి చేరుకుంటోంది. ఇక దాదాపు ప్రతీ జట్టుకూ రెండేసి మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ లెక్కన మరో 10-12 మ్యాచ్ లతో టోర్నీ సెమీ ఫైనల్ దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో టాప్ 4 లో ఉన్న దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సెమీస్ కు దూసుకెళ్తాయా లేక ఇతర జట్లు సెమీస్ కు చేరుకుంటాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టోర్నీలో నమోదవుతున్న సంచలనాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.
గత వారం రోజుల్లో జరిగిన మ్యాచ్ ల్ని గమనిస్తే టాప్ 4లో ఉన్న జట్లలోకి ఆస్ట్రేలియా వచ్చి చేరింది. అలాగే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న జట్లలో పరస్పర మ్యాచ్ లు జరుగుతూ వాటి పాయింట్లలో, స్ధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సెమీ ఫైనల్ కు అర్ఙత సాధించే అవకాశం ఐదారు స్ధానాల్లో ఉన్న జట్లకు కూడా ఉంది. ఇప్పటివరకూ చూసుకుంటే టాప్ 2లో ఉన్న రెండు జట్లు భారత్ , దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరేందుకు స్పష్టమైన అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈసారి సెమీ ఫైనల్ జట్లపై తన అంచనాలను వెల్లడించాడు.

ప్రస్తుతం వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్ధానాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లకు సెమీ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కార్తీక్ వెల్లడించాడు. తాజాగా ఆస్ట్రేలియాపై న్యూజీలాండ్ విజయం కూడా తన వ్యాఖ్యల్ని నిజం చేసేలా ఉందన్నాడు. టోర్నీలో ఇకపై అద్భుతాలు జరిగితే తప్ప ప్రస్తుతానికి టాప్ 4లో చోటు దక్కించుకున్న భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లకు సెమీస్ లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.
అయితే సెమీ ఫైనల్ కు చేరబోతున్న ఈ నాలుగు జట్లలో భారత్ కు టాప్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. అలాగే రెండు, మూడు, నాలుగు స్ధానాల కోసమే సిసలైన పోరు సాగే అవకాశం ఉందని కార్తీక్ తెలిపాడు. మనకు నలుగురు సెమీ-ఫైనలిస్టులు ఉన్నారని, ఇందులో ఎవరు నెం.2, నం.3, నం.4గా ఉండబోతున్నారనేది అసలు సమస్య అన్నాడు. నెం.1 ఎవరో మనకు బాగా తెలుసు అని భారత్ ను ఉద్దేశించి అన్నాడు. ఇది ఆత్మవిశ్వాసం కాదు, వారు ఆడుతున్న క్రికెట్ నాణ్యత మాత్రమేనని కార్తీక్ తెలిపాడు.












Click it and Unblock the Notifications