టీమిండియాలో బిగ్ వికెట్ డౌన్?
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లల్లో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్‌లు- రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. రేసు నుంచి తప్పుకొన్నాయి.
బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన తరువాత తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ కూడా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్‌పై గెలిచిన తరువాత గ్రూప్ ఏలో అగ్రస్థానానికి ఎగబాకింది న్యూజిలాండ్.

గ్రూప్ ఏలో తొలి రెండు అగ్ర జట్ల మధ్య మ్యాచ్ కావడం వల్ల దీనిపై అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఈ గేమ్‌తోనే లీగ్ దశ కూడా ముగుస్తుంది. మంగళవారం అంటే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మడమ నొప్పితో అతను సతమతమౌతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ దగ్గరి నుంచీ అతనికి ఈ ఇబ్బంది తలెత్తింది. ఆ మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా గ్రౌండ్‌ను వీడిన విషయం తెలిసిందే. కొంత విశ్రాంత తీసుకున్నాడు అప్పట్లో.

ఈ నొప్పి ఇంకా తగ్గట్లేదని చెబుతున్నారు. పెద్దగా ప్రాధాన్యత లేని గేమ్ కావడం, మున్ముందు సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉన్నందున మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడమే మేలు అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే జరిగితే- తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.
తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications