వైరం.. ముదిరింది: ముంబై ఇండియన్స్‌లో శరవేగంగా మారుతున్న పరిణామాలు

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

జట్టు కేప్టెన్‌గా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసిన తరువాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెర మీదికి తీసుకొచ్చిందా ఫ్రాంఛైజీ. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంఛైజీపై నిప్పులు చెరుగుతున్నారు.

IPL 2024: Hardik Pandya has unfollowed Rohit Sharma on Instagram: Reports

ఐపీఎల్ టోర్నమెంట్లల్లో అత్యధికంగా అయిదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను అత్యంత అవమానకరంగా కేప్టెన్సీ స్థానం నుంచి తప్పించిందంటూ ధ్వజమెత్తుతున్నారు. అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆడకూడదనీ కోరుకుంటోన్నారు.

దీని తరువాత ముంబై ఇండియన్స్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. లక్షలాది మంది ఫాలోవర్లను కోల్పోయిందా ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. రోహిత్ శర్మను తప్పించిన మరుక్షణం నుంచే పతనం ఆరంభమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య 12.6 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు ఈ సంఖ్య 20 మిలియన్లకు పైమాటే.

ఇది అక్కడితో ఆగలేదు. వ్యక్తిగత వైరానికీ దారి తీసినట్టే కనిపిస్తోంది. తనను కేప్టెన్‌గా ప్రకటించిన తరువాత హార్దిక్ పాండ్యా సైతం రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ ఫాలో చేసినట్లు వార్తలొస్తోన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచీ రోహిత్ శర్మను ఈ ప్లాట్ ఫామ్‌పై రోహిత్‌ను ఫాలో అవుతున్నాడు హార్దిక్. తాజా పరిణామాల అనంతరం అన్ ఫాలో చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+