ముంబై ఇండియన్స్ అవుట్?
IPL 2024 Mumbai Indians Playoffs chances: ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ప్లేఆఫ్స్‌లో చేరాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఓడినవే ఎక్కువ. మూడింట్లో గెలిచింది. అయిదు మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్ గెలిస్తే మరో దాంట్లో పరాభవాన్ని మూటగట్టుకుంటోంది. నిలకడగా విజయాలను సాధించడంలో విఫలమౌతోంది.

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవమే ఎదురైంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్‌కు. సోమవారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లోకల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ ఒక్కడే టాప్ స్కోరర్. 45 బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 65 పరుగులు చేశాడీ హైదరాబాదీ. 24 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో నెహాల్ వధేరా 49 పరుగులతో సత్తా చాటాడు నేహాల్ వధేరా. వీరిద్దరు తప్ప మిగిలిన బ్యాటర్లందరూ విఫలం అయ్యారు.
ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ అలవోకగా టార్గెట్‌ను ఛేదింంచింది. 18.4 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 183 పరుగులతో విజయఢంకా మోగించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లో ఏడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అతను సాధించిన రెండో సెంచరీ ఇది.
ఈ ఓటమి తరువాత ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ముంబై ఇండియన్స్‌కు మరింత సంక్లిష్టం అయ్యాయి. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌ను కూడా భారీ రన్‌రేట్‌తో నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ ఒక్కదాంట్లో ఓడినా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయినట్టే. ఇప్పుడున్న ముంబై ఇండియన్స్ పరిస్థితి చూస్తేంటే ఆరుకు ఆరు మ్యాచ్‌లనూ గెలుచుకోవడం అసాధ్యంలాగే కనిపిస్తోంది.
తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీ కేపిటల్స్‌తో ఆడాల్సి ఉంది ముంబై ఇండియన్స్‌కు. ఈ నెల 27వ తేదీన ఈ గేమ్ జరుగుతుంది. అనంతరం 30వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, మే 3వ తేదీన కోల్‌కత నైట్‌రైడర్స్, అదే నెల 6వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్, 11న మళ్లీ కేకేఆర్‌తో తలపడుతుంది. 17వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడేది చివరి లీగ్ ముంబై ఇండియన్స్‌కు.
ఈ ఆరింట్లోనూ గెలిస్తే ముంబై ఇండియన్స్ ఖాతాలో 12 పాయింట్లు వచ్చి చేరుతాయి. ప్రస్తుతం ఉన్న ఆరుకు ఈ 12 కలుపుకొంటే 18 పాయింట్లతో సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోగలదు. ఇప్పుడున్న ఫామ్ చూస్తోంటే అది సాధ్యపడుతుందా? అనేది అనుమానాలను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications