ఎన్నికల నగారా మోగిన వేళ.. ఐపీఎల్ షిఫ్టింగ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
IPL 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఏడు దశల్లో..
లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.

ఐపీఎల్ కోలాహలం..
అదే సమయంలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కానుంది. ఈ నెల 22వ తేదీన మొదలవుతుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
22న తొలి మ్యాచ్..
22వ తేదీన రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతోన్నాయి. చెన్నైలోని చెపాక్‌లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు అందరూ ఎదురు చూస్తోన్నారు.
భద్రత అవసరం..
దేశవ్యాప్తంగా అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు ఐపీఎల్ 2024 ఒకేసారి కలిసి వచ్చిన నేపథ్యంలో- టోర్నమెంట్ నిర్వహణ కష్టం కావొచ్చని, ఎన్నికల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి భారీగా భద్రత సిబ్బందిని ఉపయోగించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

కత్తి మీద సామే..
అటు ఎన్నికల సందడి, ఇటు ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల నిర్వహణ అనేది కత్తి మీద సాములాంటిదే. ప్రతి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఆటగాళ్లకూ అదే స్థాయిలో భద్రతను కల్పించాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల విధి నిర్వహణల్లో ఉండే పోలీసు, భద్రత సిబ్బందికి ఇది కొంత ఆటంకంగా కలిగించవచ్చని, అందుకే- ఈ టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలిస్తారనే ప్రచారం సాగింది.
బీసీసీఐ స్పష్టం..
వాటన్నింటికీ బీసీసీఐ తెర దించింది. టోర్నమెంట్‌ను తరలించట్లేదని తెలిపింది. మ్యాచ్‌లన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే స్వదేశంలోనే జరుగుతాయని కార్యదర్శి జై షా తెలిపారు. తొలి దశ ఎన్నికలు ఆరంభం కావడానికి చాలా సమయం ఉన్నందున ఈ లోగా సగం టోర్నమెంట్ ముగుస్తుందని వ్యాఖ్యానించారు.
పూర్తిస్థాయి షెడ్యూల్..
మ్యాచ్‌ల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఇక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయడంపై దృష్టి సారించింది. నిజానికి- ఇప్పటివరకూ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వెలువడని విషయం తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీ వరకు మాత్రమే మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది బీసీసీఐ.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications