కేకేఆర్‌కు కొత్త రైడర్

Kolkata Knight Riders: మచ్ అవైటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గడువు దగ్గరపడుతోంది. మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. నైట్‌ రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక.

IPL 2025 Ajinkya Rahane named captain of Kolkata Knight Riders and Venkatesh Iyer is Vice Captain

గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌లో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ వరకూ కేప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు జట్టులోనే లేడు. ఈ సీజన్‌లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన వేలం పాట సందర్భంగా అతన్ని కొనుగోలు చేసిందా జట్టు ఫ్రాంఛైజీ.

26.75 కోట్ల రూపాయలకు శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంది. అతని రాకతో పంజాబ్ కింగ్స్‌కు కేప్టెన్ కొరత తీరిపోయినట్టయింది కేప్టెన్సీ ట్యాగ్‌ కోసమే అయ్యర్‌ను అంత ధర పెట్టి కొనుగోలు చేసింది. 2024 సీజన్ వరకూ అతను కోల్‌కత నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఈ సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.

అదే ఆశ ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లోనూ ఉంది. కప్‌ను అందుకోవాలనే చిరకాల కోరికను శ్రేయాస్ అయ్యర్ నెరవేర్చగలడని భావించింది. ఇప్పటి దాకా ఐపీఎల్ ఛాంపియన్‌షిప్‌గా నిలవని జట్లల్లో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచీ ఇఫ్పటివరకు ఈ జట్టు ఒక్కసారి కూడా కప్‌ను గెలవలేదు. ఈ సారి ఆ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.

Take a Poll

శ్రేయాస్ అయ్యర్ జట్టును వీడటం వల్ల మరో కొత్త కేప్టెన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది కోల్‌కత నైట్ రైడర్స్ యాజమాన్యానికి. తాజాగా ఆ బాధ్యతలను వెటరన్ బ్యాటర్ అజింక్య రహానెకు అప్పగించింది. రహానెను కొత్త కేప్టెన్‌గా అపాయింట్ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది.

ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్- వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. నిజానికి..వెంకటేష్ అయ్యర్‌కే పగ్గాలు లభిస్తాయంటూ మొదట్లో వార్తలొచ్చాయి గానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. నిలకడగా రాణిస్తోండటం, అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అజింక్య రహానె వైపే మొగ్గు చూపిందా జట్టు మేనేజ్‌మెంట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+