IPL Auction 2025: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం..
ఐపీఎల్ 2025లో ఆడే ఆటగాళ్ల కోసం ఆదివారం, సోమవారం వేలం నిర్వహించనున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో 10 ప్రాంచేజీలు పాల్గొనున్నాయి. వేలానికి ముందు ప్రాంచేజీలకు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే జట్లు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అక్టోబర్ 31న జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే కీలక ఆటగాళ్లు అయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయా్ అయ్యరు వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. ప్రస్తుతం వారు వేలం ఉన్నారు.
ఐపీల్ వేలం 2025 LIVE: కాసుల వర్షం ఎవరిపై కురుస్తుంది..?
10 ఫ్రాంఛైజీలు కనీసం తదుపరి 3 సీజన్‌ల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. వేలం పెర్త్ టెస్ట్‌లో 3వ రోజు, 4వ రోజు ఆట ముగిసిన తర్వాత మొదలవుతుంది. ఈ మెగా వేలం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. వేలం ప్రక్రియ రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతోంది. మధ్యలో భోజన విరామం ఉంటుంది. మొత్తం రెండు సెషన్లలో వేలం నిర్వహిస్తారు. గతంలో దుబాయ్ ఐపీఎల్ వేలానికి ఆతిథ్యం ఇవ్వగా.. ఇప్పుడు సౌదీ అరేబియా అతిథ్యం ఇవ్వనుంది.

మెగా వేలానికి 1577 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. అయితే ప్లేయర్ పూల్ 367 మంది భారతీయ ఆటగాళ్లు, 210 మంది విదేశీ ఆటగాళ్లతో 577కి తగ్గించారు. 10 జట్లకు 204 అందుబాటులో ఉన్న స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లకు 70 స్లాట్స్ ఉన్నాయి. వేలంలో ఇద్దరు మార్క్యూ ప్లేయర్ జాబితాలు ఉన్నాయి. M1లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, మిచెల్ స్టార్క్ ఉన్నారు.
M2లో KL రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. డేవిడ్ మిల్లర్ మినహా మిగతా వారందరి బేస్ ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. అత్యధిక వయస్కుడైన ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ 43 ఏళ్ల వేలంలో ఉన్నాడు. బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వేలంలోకి వచ్చాడు. మొత్తం 10 ఫ్రాంచైజీలు మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. కేకేఆర్, ఆర్ఆర్ ఆరుగురు చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీని రిటైన్ చేసుకున్నాయి. ఢిల్లీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ తిరిగి తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ ను రిటైన్ చేసుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని తిరిగి తీసుకుంది.
ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మను రిటైన్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్ ను తిరిగి తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ ను రిటైన్ చేసుకుంది.












Click it and Unblock the Notifications