IPL 2025 రద్దు..? బీసీసీఐ అత్యవసర సమావేశం.. విదేశీ ప్లేయర్స్ ఇంటికి పంపేందుకు చర్యలు..!
భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 ను అర్ధంతరంగా రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వాళ్ల దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ధర్మశాల వేదికగా గురువారం రాత్రి జరిగిన పంజాబ్-దిల్లీ మ్యాచ్ .. ప్రారంభం అయిన కొద్ది సేపటికి స్టేడియంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. తొలుత ఫ్లడ్ లైట్స్ సమస్య అనుకున్నప్పటికీ బ్లాక్ అవుట్ నేపథ్యంలో ఒక్కసారిగా స్టేడియంలోని ప్రేక్షకులను తక్షణమే వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. దీంతో అందరూ స్టేడియం నుంచి బయటపడ్డారు. మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 ను మొత్తానికే రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
My sources tell me Fyi for now - BCCI meeting underway - IPL could be called off. First priority - to send foreigners home.
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) May 8, 2025
As per a very reliable source #IndianArmy Zindabad
మరోవైపు ఆపరేషన్ సింధూర్ రెండో రోజు కొనసాగుతోంది. భారత్.. పాకిస్థాన్ లోని లాహోర్, సియోల్ కోట్, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడి పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయు సేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చేసింది.
IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/NhX03h0Ys3
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2025
ఇక భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications