ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్‌కు భారీ ఆఫర్
Delhi Capitals: IPL 2025: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి వేటు హెడ్ కోచ్‌పై వేయటం ఖాయమైనట్టే. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం..ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

అదే సమయంలో కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ కమ్ డైరెక్టర్‌ను వెదుక్కునే పనిలో పడింది. మొన్నటివరకు ఈ హోదాలో పని చేసిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. కొందరు మాజీ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తోంది. నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌పైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదు.
ఢిల్లీ కేపిటల్స్‌లో కూడా భారీ మార్పులు చేర్పులు జరుగనున్నాయి. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇప్పటికే తప్పుకొన్నాడు. ఆయన స్థానం కూడా భర్తీ కానుంది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్‌స్టెన్, గ్రెగ్ షెప్పర్డ్, ప్యాడీ అప్టాన్.. హెడ్ కోచ్ రేసులో ఉన్నారు.
ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెరమీదికి వచ్చారు. హెడ్ కోచ్ కోసం ఆయనతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ కోసం గుజరాత్ టైటాన్స్ ఇదివరకు ప్రయత్నించింది గానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఢిల్లీ కేపిటల్స్ యువరాజ్ సింగ్‌కు గాలం వేసింది.
భారత్ తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు యువరాజ్ సింగ్. 2011లో ఐసీసీ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఐపీఎల్‌లోనూ మెరిశాడు. అపారమైన క్రికెట్ ఆడిన యూవీ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఢిల్లీ కేపిటల్స్ నిర్ణయించింది. ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని జట్టు ఇది. ఒక్కసారి మాత్రమే ఫైనల్స్ చేరింది. 2020లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.












Click it and Unblock the Notifications