IPL 2025 Mega Auction:ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలంటే..!!
IPL 2025 Mega Auction:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2025 ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు రీటెయిన్ చేసుకుంటున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. అదే సమయంలో తమకు వద్దు అన్న ఆటగాడిని వదులుకున్నాయి. వదులుకున్న ఆటగాళ్లు మరోసారి వేలంపాటలో నమోదయ్యారు. ఇక ఎవరిని ఎంతకు ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తుందో అన్న ఆసక్తి ఆటగాళ్లలో ఉండగా తమ అభిమాన ఆటగాడు ఏ జట్టులోకి వెళతాడో అని ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది మార్చి నుంచి మే చివరి వరకు క్రికెట్ లవర్స్‌ను ఎంటర్‌టెయిన్ చేయనుంది. మొత్తం 10 జట్లు ఐపీఎల్‌లో ఉన్నాయి. ఇక ఆయా జట్ల ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని మిగతా ఆటగాళ్లను వేలంపాటకు వదిలేసింది. ఇందులో వరల్డ్ టాప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ మెగా ఆటగాళ్లను ఇప్పుడు ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే నవంబర్ 24వ తేదీ, 25వ తేదీ వరకు వేచిచూడక తప్పదు.

మెగావేలంలో ఎంతమంది ఆటగాళ్లు..?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1574 మంది రిజిస్టర్ చేసుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పది ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఈ 574 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 12 మంది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం 70 ఓవర్‌సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే మార్కీ సెట్లలో ఏడుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్,మహ్మద్ సిరాజ్,మొహ్మద్ షమీ,చాహల్,అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. వేలంపాటలో వీరి కనీస ధర రూ.2 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది.ఇక అక్కడి నుంచి వారిని ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తుందో వేచి చూడాలి.
ఐపీఎల్ 2025 ఆక్షన్‌లో మల్లికా సాగర్
ఐపీఎల్ 2025 సీజన్‌కు వేలం నిర్వహించే బాధ్యతను ఈసారి కూడా మల్లికా సాగర్‌కే అప్పగించారు.అంతకుముందు అంటే ఐపీఎల్ 2024 సీజన్ వేలంపాటను కూడా ఈమే నిర్వహించారు.కొన్నేళ్లుగా హ్యూ ఎడ్మీడ్స్ ఈ బాధ్యతను చేపట్టేవారు.ఈ సారి ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉన్న రోజే భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలిటెస్టు ఉండటంతో బీసీసీఐ కాస్త తెలివిగా వ్యవహరించి, ఆ మ్యాచ్ అయ్యాక వేలంపాటను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది.

ఐపీఎల్ 2025 మెగా వేలం ఎప్పుడు ఎక్కడ..?
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌కు జెడ్డా నగరం వేదికగా నిలిచింది. జెడ్డాలోని అబాడీ అల్ జోహర్ ఎరీనా, (బెంచ్ మార్క్ ఎరీనా ) ఐపీఎల్ మెగావేలంకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంపాట స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అంటే భారత్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మెగా ఆక్షన్ ప్రారంభం అవుతుంది. ఈ మొత్తం ఆక్షన్, యాక్షన్‌ను ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ పార్ట్‌నర్ స్టార్ స్పోర్ట్స్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.ఇక జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌పై కూడా ఐపీఎల్ ఆక్షన్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.
ఇక రానున్న ఆదివారం (నవంబర్ 24), సోమవారం(నవంబర్ 25) రెండ్రోజుల పాటు క్రికెట్ లవర్స్‌కు నాన్‌స్టాప్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇవ్వనుంది ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్. మరి మీ అభిమాన క్రికెటర్ ఏ జట్టులో ఉంటే బాగుంటుందో మీరే కామెంట్ చేయండి.












Click it and Unblock the Notifications