CSK vs MI:ఎవడు భయ్యా ఈ విఘ్నేష్ పుతూర్..చెన్నైకి చెమటలట్టించేశాడు..!!

Vignesh Puthur:2025 మార్చి 23,ఆదివారం ఐపీఎల్‌లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిగాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడగా కావ్యా మారన్ టీమ్ వండర్ విక్టరీ సాధించింది. ఇక రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగగా అందులో చెన్నై జట్టు కూల్ విక్టరీ నమోదు చేసింది. సన్‌రైజర్స్ జట్టు వీరబాదుడు బాదగా.. చేజింగ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కూడా ముచ్చటైన షాట్లతో మురిపించింది. అయితే చివరి వరకు ఆ మొమెంటంను క్యారీ చేయలేక చతికిల పడింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు తక్కువ స్కోరుకే ఔట్ కాగా.. చెన్నై జట్టు ఆ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు కాస్త కష్టపడాల్సి వచ్చింది. అంతలా పరిస్థితి వచ్చేందుకు కారణం ముంబై ఇండియన్స్ చిన్నోడు విఘ్నేష్ పుతూర్. చెన్నైకే చెమటలు పట్టించిన ఈ చిన్నోడు ఎవరా అని గూగుల్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్.

విఘ్నేష్ కోసం సెర్చింగ్..
విఘ్నేష్ పుతూర్... 24 ఏళ్ల కుర్రాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెన్నైపై 32 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీయడంతో లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఎవరీ చిన్నోడంటూ క్రికెట్ లవర్స్ తెగ గూగిలింగ్ చేసేస్తున్నారు. కేరళకు చెందిన ఈ క్యూట్ బాయ్ మలప్పురం వాసి. అక్కడే క్రికెట్ ఓనమాలు దిద్దాడు.తండ్రి సాధారణ ఆటో డ్రైవర్. కేరళ రాష్ట్రం తరపున అండర్ -14,అండర్ -19 టోర్నమెంట్లలో సారథ్యం వహించాడు.కేరళ క్రికెట్ లీగ్‌లో అలెప్పీ రిపెల్స్ జట్టు తరపున ఆడాడు. మూడు మ్యాచుల్లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. కెరీర్ తొలినాళ్లలో మీడియం పేస్ వేసిన విఘ్నేష్... స్థానిక క్రికెటర్ అయిన మొహ్మద్ షరీఫ్ ఇచ్చిన సూచనతో లెగ్ స్పిన్‌కు మారాడు. అప్పటి వరకు తాను బౌలింగ్ వేస్తున్నప్పటికీ చైనామాన్ అనే పదం ఈ చిన్నోడికి తెలీదు.

ipl-2025-who-is-vignesh-puthur-another-quality-spinner-that-mumbai-indians-factory-has-produced

కెరీర్ ఇలా..
ఇక తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు క్రికెట్‌లో మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు సొంత ఊరు విడిచి త్రిస్సూర్‌కు చేరాడు. కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ20 లీగ్‌ టోర్నీలో సెయింట్ థామస్ కాలేజీ తరపున ఆడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదే అతన్ని అలెప్పీ రిపెల్స్ జట్టులో చోటు దక్కేలా చేసింది. ఇక తన కెరీర్ మలుపు తిరిగింది ఇక్కడే. ఇతని ప్రదర్శన చూసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌత్ ఆఫ్రికా 20 టోర్నమెంటుకు ఎంఐ కేప్‌టౌన్‌ తరపున నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది. రషీద్ ఖాన్‌ స్టయిల్‌ను అనుకరిస్తూ అలరించాడు.

ముంబై ఎంతకు కొనింది..?
అంతకుముందు జరిగిన ఐపీఎల్ వేలంలో విఘ్నేష్ పుతూర్‌ను ముంబై ఇండియన్స్ జట్టు బేస్ ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే ఆ జట్టు కోచ్ మహేలా జయవర్ధనే ఈ కుర్రాడికి చోటు కల్పించి సాహసం చేశాడు. కోచ్, జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఏకంగా మూడు వికెట్లను తీసి ఆకట్టుకున్నాడు. అందులో ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్, శివం దూభేల వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ ఈ చిన్నోడిని అభినందించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.

భారత జట్టుకు ముంబై ఇండియన్స్ ఫ్యాక్టరీ నుంచి మరో యువ సంచలనం విఘ్నేష్ పుతూర్ రూపంలో దొరికాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ కుర్రాడికి చక్కటి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+