IPL 2026 Fan Parks: 15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లు-తెలంగాణలో..!

క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మరో ఐపీఎల్ సీజన్ (IPL 2026) సిద్ధమైంది. ఈ నెల 28న సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 మ్యాచ్ లకు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మ్యాచ్ లు ముగిసేలోపు రెండో దశ షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్ ల వేదికల్ని ఖరారు చేయడంలో పలు సమీకరణాలు తప్పడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ వచ్చేలా ఫ్యాన్ పార్కులూ (ipl 2026 fan parks) సిద్దమవుతున్నాయి.

ఐపీఎల్ లు మ్యాచ్ లు జరిగే సమయంలో వాటికి ఆతిధ్యమిస్తున్న నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ క్రికెట్ ఫీవర్ కొనసాగించేందుకు వీలుగా బీసీసీఐ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఫ్యాన్ పార్క్‌లో ప్రత్యక్ష మ్యాచ్ ప్రసారాలతో పాటు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు, వర్చువల్ బ్యాటింగ్ అనుభవాలు, బౌలింగ్ నెట్లు, ఫేస్ పెయింటింగ్, చీర్-ఓ-మీటర్లు, 360° ఫోటో బూత్‌ల వంటి అభిమానులను ఆకట్టుకునే ఇంటరాక్టివ్ కార్యక్రమాలతో సహా అనేక ఆసక్తికరమైన ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలు ఉంటాయి. ఎంపిక చేసిన నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చి మ్యాచ్ లు చూసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి కూడా ఐపీఎల్ తొలి దశ మ్యాచ్ ల కోసం 15 నగరాలను ఈ ఫ్యాన్ పార్కుల ఏర్పాటు కోసం బీసీసీఐ ఎంపిక చేసింది.

IPL 2026 Fan Parks to Decentralize Cricket Excitement Spanning 15 Cities from Rohtak to Nizamabad

ఈ ఫ్యాన్ పార్కుల్ని మూడు వీకెండ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. తొలి వీకెండ్ మార్చి 28, 29 తేదీల్లో, అలాగే రెండో వీకెండ్ ఏప్రిల్ 4, 5 తేదీల్లో, మూడో వీకెండ్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో వస్తున్నాయి. వీటిలో తొలి వీకెండ్ లో అంటే మార్చి 28, 29 తేదీల్లో రోహ్ టక్, భోపాల్, నాగ్ పూర్, తుమకూరు, కృష్ణానగర్ లో ఏర్పాటు చేస్తున్నారు. రెండో వీకెండ్ లో మధుర, జోథ్ పూర్, నిజామాబాద్, మైసూరు,భువనేశ్వర్ లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మూడో వీకెండ్ లో మీరట్, నడియాడ్, రత్నగిరి, కోయంబత్తూరు, రూర్కెలాలో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ లోని విమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్స్ లో ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+