IPL 2026 Final :టైటిల్ ఎవరికో ఖరారైందా ? ఏఐ తాజా జోస్యం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 20226 Final) ఫైనల్ కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే తొలి క్వాలిఫయర్ లో విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేరుగా ఫైనల్ చేరుకుంది. ఆర్సీబీ చేతిలో ఓడిన జీటీ.. ఇప్పటికే ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ పై గెలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR)) తో ఇవాళ రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సిద్దమైంది. జీటీ-ఆర్ఆర్ (GT vs RR) జట్ల మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ లో గెలిచే జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో పైనల్ కు చేరే జట్టుతో పాటు టైటిల్ గెల్చుకునే జట్టుపైనా ఏఐ ప్లాట్ ఫామ్ క్లాడ్ (Claude) తన అంచనా వెల్లడించింది.
ఇవాళ రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచే అవకాశం ఉందని, కాబట్టి ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే అవకాశం గిల్ సేనకే ఉందని ఏఐ జోస్యం చెప్పింది. ఆర్సీబీ-జీటీ మధ్య ఈ నెల 31న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ కే గెలిచే అవకాశం ఉందని ఏఐ తేల్చిచెప్పింది. ఆర్సీబీకి గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.

సీజన్ పొడవునా ఆధిపత్యం, నిలకడైన క్రికెట్‌ను ప్రదర్శిస్తూ, 18 పాయింట్లతో మూడు జట్లలో అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడం ఆర్సీబీకి ప్లస్ కానున్నాయి. 2025 టైటిల్ గెలిచిన ఊపుతో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్లు కావడం, క్వాలిఫయర్ 1లో జీటీని 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన మానసిక అనుభవం ప్లస్ ఆధిక్యత, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రజత్ పాటిదార్‌లతో కూడిన స్టార్ బ్యాటింగ్ లైనప్, ఫైనల్‌కు ముందు దొరికిన నాలుగు రోజుల విశ్రాంతి కలిపి ఆర్సీబీకి కచ్చితంగా ప్రయోజనం కలిగిస్తాయని ఏఐ అంచనా వేస్తోంది. మరి ఈ అంచనా నిజమవుతుందా లేక తిరగబడుతుందా చూడాలంటే ఎల్లుండి వరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications