IPL 2026: RCB అభిమానులకు అదిరిపోయే న్యూస్-మళ్లీ ఛాన్స్-కండిషన్స్ అప్లై..!
గతేడాది చిన్న స్పామి స్టేడియంలో జరిగిన అభిమానుల తొక్కిసలాట నేపథ్యంలో ఆర్సీబీ ఆడే మ్యాచ్ లపై కర్నాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2026(IPL 2026)కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ పై ఉన్న క్రికెట్ ఫీవర్ కాస్తా మరో నెల రోజుల్లో ఐపీఎల్ పైకి మళ్లబోతోంది. ఇలాంటి సమయంలో గతేడాది ఐపీఎల్ టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఈ సారి హోంగ్రౌండ్ అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం దొరుకుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు కర్నాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచ్ లు (RCB)
గతేడాది తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ దక్కించుకున్న తర్వాత చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించిన సంబరాలు వివాదాస్పదమయ్యాయి. చిన్న స్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో అభిమానులు చనిపోవడంతో కర్నాటక ప్రభుత్వంపై చర్యలు తీసుకోక తప్పని ఒత్తిడి ఎదురైంది. దీంతో చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ లను కూడా నిర్వహించకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ కర్నాటక కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఆర్సీబీకి కర్నాటక కేబినెట్ ఊరట
ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభోత్సవాలతో పాటు ఆర్సీబీ ఆడే మ్యాచ్ లను కూడా చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు వీలుగా కర్నాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు కొన్ని భద్రతా ఆంక్షలతో ఈ అనుమతి ఇస్తున్నట్లు కర్నాటక కేబినెట్ ప్రకటన తెలిపింది. ఈ నిర్ణయంతో కర్నాటకలో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తిరిగి సొంత గ్రౌండ్ చిన్న స్వామిలో ఆర్సీబీ మ్యాచ్ లు చూడలేమన్న ఆందోళన వారిలో తొలగిపోయింది. చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ లకు అనుమతించిన కర్నాటక ప్రభుత్వం.. భద్రతపై మాత్రం రాజీపడబోమని ఫ్రాంచైజీకి తేల్చిచెప్పేసింది. ఇక్కడ ఆడే మ్యాచ్‌లకు పటిష్ట మార్గదర్శకాలతోనే అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కండిషన్లు ఇవే
తాజా భద్రత, నిర్వహణ ప్రణాళికలను అధికారులు పరిశీలించి ఆమోదించారని వెల్లడించింది. సవరించిన బ్లూప్రింట్ ప్రకారం, పటిష్ట ఎంట్రీ, ఎగ్జిట్ వ్యవస్ధళతో పాటు జనసమూహ నియంత్రణ వ్యూహాలు, భద్రతా సిబ్బంది మోహరింపుల పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ప్రత్యేక ఆన్-సైట్ వైద్య, అత్యవసర బృందాలు, కంట్రోల్ రూమ్‌ల మధ్య నిరంతర సమన్వయం కూడా చేపడతారు. ట్రాఫిక్ నిర్వహణతో పాటు, బెంగళూరు పోలీసులు, బీబీఎంపీ, ఏజెన్సీలు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications