IPL 2027: ఆ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ? తుది దశలో మెగా డీల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026(IPL 2026) సీజన్ ముగియగానే ఈసారి తర్వాతి సీజన్ (IPL 2027) చర్చ మొదలైపోయింది. దీనికి కారణం గతంతో పోలిస్తే ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ఎంపిక విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తుండటమే. ఇందులో భాగంగానే డిసెంబర్ లో జరిగే మినీ ఆక్షన్ కు ముందే ఆటగాళ్ల మార్పిళ్లు జోరందుకుంటున్నాయి. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ ను వీడేందుకు సిద్దంగా ఉన్న ఆల్ రౌండర్ హార్జిక్ పాండ్యా (Hardik Pandya) కోసం చాలా జట్లు కాసుకుని కూర్చొన్నాయి.
ఈ తరుణంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో డీల్ సెట్ అయినట్లే అయి పక్కకుపోయింది. దీంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు హార్దిక్ పాండ్యాను బ్లాక్ బస్టర్ డీల్ తో తీసుకుని, కెప్టెన్సీ కూడా అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆజింక్య రహానే క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ వెతుకులాటలో ఉన్న కేకేఆర్ చూపు హార్దిక్ పాండ్యాపై పడింది. దీంతో ఈ టీమిండియా ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తోంది. హార్దిక్ పాండ్యా కోసం కోల్ కతా నైట్ రైడర్స్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ సోషల్ మీడియా ద్వారా కీలక అప్డేట్ ఇచ్చారు.

హార్దిక్ పాండ్యాను కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తమ కొత్త కెప్టెన్ గా ఎంపిక చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై కేకేఆర్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌కు తిరిగి బదిలీ చేయడం ద్వారానే హార్దిక్‌ను కేకేఆర్ దక్కించుకుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి రూ.15 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా ఒకవేళ నిష్క్రమిస్తే, ముంబై జట్టు తదుపరి సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో భారత జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం సూర్యకుమార్‌కు ఉంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్ వైపే ముంబై మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.




Click it and Unblock the Notifications