IPL Auction 2025 Live: చెన్నైకి బిగ్ షాక్-ఆ ఇద్దరు విధేయులు అవుట్..! సంచలనాలివే..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న తొలి రోజు వేలం పూర్తి కాగా.. ఇవాళ రెండో రోజు వేలం ప్రారంభమైంది. ఇందులో వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అత్యధిక మొత్తానికి అమ్ముడయ్యాడు. లక్నోతో జరిగిన హోరాహోరీ పోటీలో భువనేశ్వర్ ను ఆర్సీబీ 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. భువీతో పాటు ఇవాళ భారత పేస్ బౌలర్లు రెండో రోజు వేలంలో ఎక్కువ మొత్తాలకు అమ్ముడయ్యారు.
భారత పేసర్లు ఆకాశ్ దీప్ (ఎల్‌ఎస్‌జి 8 కోట్లు), దీపక్ చాహర్ (ముంబై రూ.9.25 కోట్లు), ముఖేష్ కుమార్ (డిసి,రూ.8కోట్లు), తుషార్ దేశ్‌పాండే (ఆర్‌ఆర్,రూ.6.50 కోట్లు) అధిక ధరలకు అమ్ముడయ్యారు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టుకు ఎప్పటి నుంచో ఆడుతున్న ఇద్దరు విధేయ బౌలర్లు తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్‌లను ఆ జట్టు ఇవాళ వేలంలో ఇతర జట్లకు కోల్పోయింది. దేశ్ పాండేను రాజస్తాన్ రాయల్స్ ఆరున్నర కోట్లకు, చాహర్ ను ముంబై 9.5 కోట్లకు ఎగరేసుకుపోయాయి.

ఈ రెండింటితో పాటు ఇవాళ రెండో రోజు వేలంలో మరికొన్ని సంచలనాలు కూడా నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ పట్టించుకోకపోవడంతో కేవలం రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అలాగే కేన్ విలియమ్సన్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, అజింక్యా రహానే వంటి స్టార్ ప్లేయర్లు కూడా అమ్ముడుపోలేదు. ఇప్పటివరకూ వివిధ జట్ల వద్ద ఉన్న మొత్తాల్ని పరిశీలిస్తే.. ఆర్సీబీ రూ 14.15 కోట్లు, చెన్నై- RS 13.20 కోట్లు, గుజరాత్- రూ 11.90 కోట్లు,ముంబై - రూ 11.05 కోట్లు, పంజాబ్ కింగ్స్- రూ 10.90 కోట్లు, కోల్ కతా- రూ 8.55 కోట్లు, లక్నో- రూ 6.8 కోట్లు, రాజస్తాన్- రూ. 6.65 కోట్లు, హైదరాబాద్-రూ.5.15 కోట్లు, ఢిల్లీ - రూ.3.80 కోట్లు ఉన్నాయి. ఇవాళ మొత్తం 84 మంది ఆటగాళ్లలో 72 మంది అమ్ముడుపోగా.. మరో 12 మంది మిగిలిపోయారు.












Click it and Unblock the Notifications