పాకిస్థాన్ దాడి .. ఐపీఎల్ మ్యాచ్‌‌లో యుద్ధ సైరన్

ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం ఐపీఎల్‌ను సైతం తాకింది. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం జరుగుతున్న పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది.దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఆటగాళ్లు , ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే, పాకిస్తాన్ వైపు నుండి దాడులు పెరిగిన నేపథ్యంలో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు అధికారులు. వెంటనే గ్రౌండ్‌ను ఖాళీ చేయాలంటూ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు అధికారులు సూచించారు. ఆటగాళ్లను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించారు.

IPL match cancelled in wake of Pakistan attacks

ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడం మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ రద్దుతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) త్వరలో ఈ మ్యాచ్‌ను తిరిగి నిర్వహించే విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు అభిమానులు ఓపికగా వేచి ఉండాలని కోరుకుంటున్నామని బీసీసీఐ తెలిపింది.

మరోవైపు భారత్ , పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్.ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాకిస్థాన్‌‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇండియా దాడి చేయడంతో పాక్ పగతో రగిలిపోతుంది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సామాన్య ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.

ఈ దాడి 15 మంది భారత పౌరులు మరణించారు. 150 మందికి పైగా గాయాలయ్యాయి. భారత్ సైతం పాక్‌కు గట్టిగానే బుద్ధి చెబుతోంది. దీనిలో భాగంగానే పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై భారత్ ఆర్మీ డ్రోన్ దాడులు జరిగాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియం వద్ద ఓ డ్రోన్ కూలిపోయినట్టు తెలుస్తోంది.ఈ దాడిలో స్టేడియం కొంత మేర దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

రావల్పిండిలో ఈ రాత్రి పీఎస్ఎల్ క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకున్నాయి. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎస్ఎల్ లోని మిగతా మ్యాచ్‌లను పాక్ క్రికెట్ బోర్డు దుబాయ్‌కి మార్చాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాడి సమయంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు అక్కడే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ దాడిలో వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+