భారత్ ఓటమిపై సీవీ ఆనంద్ 4 కారణాలు

వన్డేల్లో న్యూజిలాండ్ సరికొత్త చరిత్రను లిఖించింది. 38 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. భారత గడ్డపై భారత్ ను తొలిసారిగా ఓడించింది. వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీ వేస్ట్ అయిందీ మ్యాచ్ లో.

తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) శతకాలతో రాణించారు. అనంతరం భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా తప్ప మరెవరూ జట్టును ఆదుకోలేదు. కోహ్లీ సెంచరీ, నితీష్, రాణా హాఫ్ సెంచరీలు వ్యర్థం అయ్యాయి.

IPL Money Biased Selections or Gautam Gambhir as coach CV Anand raised questions

1988లో తొలిసారి వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌.. ఈ గడ్డపై గెలవడం ఇదే తొలిసారి. వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ సమం చేసింది. డిసైడర్ నూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టీమిండియాకు దిమ్మతిరిగే షాకిచ్చింది. గత ఏడాది ఇదే తరహాలో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో భారత్ ను కోలుకోలేని దెబ్బతీసింది.

ఈ ఓటమిపై సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ హోం శాఖ కార్యదర్శి సీవీ ఆనంద్ స్పందించారు. భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చిందని, వన్డేల్లో తొలిసారిగా 1-2 తేడాతో భారత్ ఓటమిపాలు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. గత ఏడాది టెస్టు సిరీస్‌లోనూ కివీస్ 3-0 తో భారత్‌ను చిత్తుచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పరిణామాలు క్రికెట్ అభిమానుల్లో ఆందోళనలను రేకెత్తిస్తోందని అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, బలమైన దేశీయ క్రికెట్ వ్యవస్థ, అపార ప్రతిభ ఉన్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో భారత జట్టు పెద్దగా విజయాలేవీ సాధించలేకపోతోందని సీవీ ఆనంద్ అన్నారు. టీ20 ప్రపంచకప్ మినహా సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు ఏమైందని ప్రశ్నించారు. ఐపీఎల్ డబ్బు ప్రభావమా? మానసిక స్థితి లోపమా? పక్షపాత ఎంపికలా? లేదా కోచ్‌గా గౌతమ్ గంభీర్ కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+