క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..ఐపీఎల్ మళ్లీ షూరు

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది! ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 17వ తేదీ నుంచి లీగ్ మ్యాచ్‌లు తిరిగి మొదలవుతాయని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన ఈ మెగా టోర్నీ మళ్లీ సందడి చేయనుంది. మిగిలిన మ్యాచ్‌ల కోసం క్రికెట్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మే 17 నుంచి మొదలయ్యే ఈ క్రికెట్ సంబరం జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.

IPL to resume from 17th of this month

కేవలం 17 రోజుల్లోనే మిగిలిన మ్యాచ్‌లన్నీ పూర్తి చేసేలా బీసీసీఐ ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉండనున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇక పండగే పండగ. తమ అభిమాన జట్లను మళ్లీ మైదానంలో చూడటానికి, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+