Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బుమ్రా సూపర్ ఫాస్ట్ యార్కర్ దెబ్బకు షాన్ కిషన్ కు తీవ్ర గాయం: చిట్లిన బొటనవేలు

టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్ ఏ లో భాగంగా నేడు నమీబియాను ఢీ కొట్టనుంది భారత్. ఢిల్లీలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇప్పటికే ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్ లో బోణీ కొట్టింది టీమిండియా. తన తొలి మ్యాచ్ లో యునైటెడ్ స్టేట్స్ ను ఓడించింది. టీమిండియాతో పోల్చుకుంటే చిన్న జట్టే కావడంతో నమీబియాపైనా గెలుపు నల్లేరు మీద నడకే కావొచ్చు. గెలుపు అంతరం ఎలా ఉంటుందనేది ఇక్కడ పాయింట్.

కాగా- ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు సవాళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళనలు ఉండగా, ఇప్పుడు కొత్త గాయం జట్టు యాజమాన్యాన్ని మరింత కలవరపెడుతోంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఢిల్లీలో జరిగిన నెట్ సెషన్‌లో ఇషాన్ కిషన్‌ గాయపడ్డాడు. అతని ఎడమ కాలి బొటనవేలికి గాయమైంది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఓ సూపర్ ఫాస్ట్ యార్కర్ డెలివరీ అతని కాలిని బలంగా తగిలింది.

Ishan Kishan Painful Blow from Jasprit Bumrah in Nets Leaves India Wary Ahead of Namibia Clash

దీని దెబ్బకు ఎడమకాలి బొటనవేలు చిట్లింది. బంతి తగిలిన వెంటనే ఇషాన్ కిషన్ నేలపై కూర్చుండిపోయాడు. నొప్పితో విలవిలలాడుతూ గ్రౌండ్ పైనే చాలాసేపు ఉండిపోయాడు. ప్రాక్టీస్‌ను నిలిపివేశాడు. తీవ్ర అసౌకర్యంగా కనిపించాడీ వికెట్‌ కీపర్ బ్యాటర్. నెట్స్‌ నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపు తిరిగి బ్యాటింగ్ చేయడానికి వచ్చినా, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. వచ్చిన కొద్దిసేపటికే వెనక్కి వెళ్లాడు. ఆ సమయంలో ఎడమకాలి పాదాన్నిసరిగ్గా భూమిపై ఆన్చడంలో కొంత ఇబ్బంది పడినట్టు కనిపించింది.

నమీబియా మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. దీనిపై మధ్యాహ్నానికి ఏదైనా తాజా సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అతని ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కడుపు సంబంధిత సమస్యలతో ఇటీవలే ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యాడు గానీ అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరూ పూర్తిగా ఫిట్‌గా లేకపోతే- టీమిండియా ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో పెద్ద మార్పులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేయాల్సి వస్తుంది. సంజు శాంసన్ ఒక ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉండగా, వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనింగ్‌లో ప్రయత్నించే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని, టీమ్ ఏ ఆటగాడితోనూ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+