కావ్య పాప అందుకే అతన్ని వదలడం లేదా..!

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను ఆడుతోంది. తొలి టీ-20 మ్యాచ్ బుధవారం రాత్రి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 132 పరుగులకు కుప్పకూలింది.

అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్. కేవలం 34 బంతులలోనే 79 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. క్రీజ్ లోకి వచ్చిన సమయం నుండే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Kavya Maran spotted Abhishek Sharma s talent early on

ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడి 34 బంతులలోనే 79 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అభిషేక్ దెబ్బకు 12.5 ఓవర్లలోనే మ్యాచ్‌ పూర్తైంది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ మరోసారి వార్తలో నిలిచారు. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్ టీం తరుఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తోంది.

అభిషేక్ శర్మలో టాలెంట్‌ను ముందే గ్రహించిన కావ్య మారన్ అందుకే అతన్ని జట్టులో కొనసాగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డేవిడ్ వార్నర్ , భువనేశ్వర్, కేన్ విలియమ్సన్, వంటి ప్లేయర్లను జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ ,అభిషేక్ శర్మ‌ను మాత్రం చాలా ఏళ్లుగా జట్టులో కొనసాగిస్తూ వస్తోంది. గత ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ‌ సత్తా చాటాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+