కేఎల్ రాహుల్‌కు బిగ్ షాక్ ..ఆ బౌలర్ కంటే తక్కువ ధరకే
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తోన్న తరుణం వచ్చేసింది. ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం నేడు, రేపు జరగనుండగా.. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకుంటున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు ఈసారి జరిగిన ఐపీఎల్ వేలంలో బిగ్ షాక్ తగిలినట్టు అయింది.
రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ల తర్వాత కేఎల్ రాహుల్ కూడా అదే ధరను దక్కించుకుంటాడని అనుకున్నారు. కానీ, వేలంలో కేఎల్ రాహుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. యుజువేంద్ర చాహల్ ఈ ఏడాది వేలంలో రూ. 2 కోట్ల ధరతో ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ టీం రూ. 18 కోట్లకు దక్కించుకుంది. కేఎల్ రాహుల్ కంటే చాహల్ అధిక ధర పలకడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యార్ అధిక ధరను దక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రేయాస్ ధర రూ. 18 కోట్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోరాడాయి. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. చివరిదాకా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ధరకు చేతులెత్తేసింది. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ వశం అయ్యాడు.శ్రేయాస్ అయ్యర్‌కు పంజాబ్ జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశాలున్నాయి.
ఇక రిషబ్ పంత్ పలు జట్లు గట్టిగానే పోటీ పడ్డాయి. ఎల్‌ఎస్‌జీ అత్యధికంగా రూ. 20.75 కోట్లకు బిడ్ చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ RTMని ఉపయోచింది. దీంతో LSG బిడ్‌ను రూ. 27 కోట్లకు పెంచి ఫైనల్ చేసుకుంది. రూ. 2 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, LSG, RCB పోరుతో మొదలైన ఈ యుద్దం చివరకు రూ. 27 కోట్లతో ముగిసింది.
బౌలర్ అర్షదీప్ సింగ్ సైతం జాక్ పాట్ కొట్టాడు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో అర్షదీప్ సింగ్ 18 కోట్లకు అమ్ముడుపోయి జాక్ పాట్ కొట్టాడు.












Click it and Unblock the Notifications